News


నిఫ్టీ మద్దతు 12,099, నిరోధం 12,069

Thursday 30th January 2020
Markets_main1580354576.png-31314

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 9 పాయింట్లు డౌన్‌
ఆసియాలో జపాన్‌ మార్కెట్‌ పతనం
మళ్లీ ఊపందుకున్న కరోనా భయాలు 

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 9 పాయింట్ల వెనకడుగుతో 12,112  వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,121 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ తాజాగా జపాన్‌కు చేరడంతో నికాయ్‌ ఇండెక్స్‌ 1.5 శాతం పతనమైంది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఈ నెలాఖరున నిర్వహించనున్న సమావేశంలో కరోనా వైరస్‌పట్ల గ్లోబల్‌ ఎమర్జెన్సీను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తన సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతూ ఆర్థికాభివృద్ధి పట్ల జాగురూకత వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం గరిష్టస్థాయి నుంచి క్షీణించి అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే దేశీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కాగా క్రితం రోజు బడ్జెట్‌పై ఆశలతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ చేసింది. వెరసి 41,000 స్థాయిని అధిగమించింది. 232 పాయింట్లు పెరిగి 41,199 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 74 పాయింట్లు జమ చేసుకుని 12,130 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,099 పాయింట్ల వద్ద, తదుపరి 12,069 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,165 వద్ద, ఆపై 12,200 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,781 పాయింట్ల వద్ద, తదుపరి 30,685 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,028 పాయింట్ల వద్ద, తదుపరి 31,179 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1014 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1521 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1358 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 712 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.  
 You may be interested

కాకినాడలో లలిత జ్యూయలర్స్‌ ప్రారంభం

Thursday 30th January 2020

బంగారు, వజ్రాభరణాల విక్రయ సంస్థ లలిత జ్యూయలర్స్‌ 25వ బ్రాంచ్‌ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు, లలిత జ్యూయలర్స్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌ కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ప్రారంభించారు.  నాణ్యత, ధర విషయంలో రాజీలేని విధంగా బంగారు, వజ్రాభరణాల విక్రయాల్లో ఖ్యాతిపొందిన లలిత జ్యూయలర్స్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు కావడం ఈ

ఒకే జీఎస్‌టీ రేటు ఉండాలి

Thursday 30th January 2020

అధిక నిరుద్యోగిత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్వల్పంగా అధికమైన ఆదాయాల స్థాయి.. వెరశి పట్టణ డిమాండ్‌కు అడ్డుకట్ట పడుతోంది. డిమాండ్‌ తిరిగి గాడినపడాలని ఫాస్ట్‌ మూవింగ్‌ కంజ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు కోరుతున్నాయి. బడ్జెట్‌లో ప్రకటించబోయే ఉద్దీపణలపైనే ఇది ఆధారపడి ఉందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను స్లాబు సవరణ, ఉద్యోగాల కల్పన, గ్రామీణ కస్టమర్లకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందజేస్తే ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయని

Most from this category