News


నిఫ్టీ మద్దతు 12,183...నిరోధం 12284

Monday 30th December 2019
Markets_main1577675771.png-30506

స్వల్ప లాభంతో కదులుతున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(సోమవారం) అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 12,329 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. గత వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి ర్యాలీ బాట పట్టాయి. సెన్సెక్స్‌ 411 పాయింట్లు జంప్‌చేసి 41,575 వద్ద నిలవగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 119 పాయింట్లు ఎగసి 12,246 వద్ద స్థిరపడింది. అయితే కొత్త ఏడాది సెలవుల నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. జపాన్‌, కొరియా, ఇండొనేసియా 0.5-0.2 శాతం మధ్య నీరసించగా.. హాంకాంగ్‌ 0.45 శాతం బలపడింది. ఇతర మార్కెట్లలో చైనా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, తైవాన్‌ నామమాత్ర లాభాలతో కదులుతున్నాయి. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,183 పాయింట్ల వద్ద, తదుపరి 12,120 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,284 వద్ద, ఆపై 12,321 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32164 పాయింట్ల వద్ద, తదుపరి 31916 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 32553 పాయింట్ల వద్ద, తదుపరి 32693 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

స్వల్ప పెట్టుబడులు 
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 81 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 126 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 504 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 120 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.



You may be interested

అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే..

Monday 30th December 2019

ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ - ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ పెట్టుబడులపై రిస్క్‌ తగ్గించుకునేందుకు పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఎంతో అవసరం. ఇన్వెస్టర్లు తప్పకుండా అనుసరించాల్సిన సూత్రం ఇది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీలో లేక రియల్‌ ఎస్టేట్‌లో.. ఇలా ఏ ఒక్క విభాగంలోనే ఇన్వెస్ట్‌ చేయడం వైవిధ్యానికి వ్యతిరేకం. ఇక ఈక్విటీల్లోనూ పెట్టుబడులన్నింటినీ ఒకే విభాగంలో ఇన్వెస్ట్‌ చేయడం కూడా వైవిధ్యం అనిపించుకోదు. కనుక వైవిధ్యం కోరుకునే వారు మన దేశ కంపెనీలతోపాటు,

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 30th December 2019

టాటా కెమికల్స్‌:-        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ:- ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర:- రూ.668 టార్గెట్‌ ధర:- రూ.811 ఎందుకంటే:- ఉత్తర అమెరికాలో ఉన్న జాయింట్‌ వెంచర్‌ కంపెనీ(టాటా కెమికల్స్‌ సోడా యాష్‌ పార్ట్‌నర్స్‌ హోల్డింగ్స్‌-టీసీసాప్‌)లో 25 శాతం వాటాను టాటా కెమికల్స్‌ కొనుగోలు చేసింది. దీంతో టీసీసాప్‌లో వంద శాతం వాటా టాటా కెమికల్స్‌ పరమైంది. ఈ వాటా కొనుగోలు కోసం టాటా కెమికల్స్‌ కంపెనీ 19.5 కోట్ల డాలర్లు వెచ్చించింది. దీంట్లో 17.5

Most from this category