News


నిఫ్టీ తక్షణ మద్దతు 12,298, అవరోధం 12,350

Tuesday 14th January 2020
Markets_main1578972324.png-30901

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11 పాయింట్లు ప్లస్‌
నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి(13న) ఉదయం  8.40 ప్రాంతం‍లో 11 పాయింట్ల స్వల్ప లాభంతో 12,373 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,362 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార డీల్‌ కుదరనున్న అంచనాలతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలను చేరాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇండెక్సులు​0.3-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. మరోవైపు దేశీయంగానూ సోమవారం మార్కెట్లు చరిత్రాత్మ గరిష్టాలను తాకాయి. తొలుత 41,900 సమీపానికి చేరడం ద్వారా సెన్సెక్స్‌, 12,338కు చేరడం ద్వారా నిఫ్టీ సరికొత్త ఇంట్రాడే రికార్డులను సాధించాయి. చివరికి సెన్సెక్స్‌ 260 పాయింట్లు జంప్‌చేసి 41,860 వద్ద నిలవగా.. నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 12,330 వద్ద ముగిసింది. ఇవి కూడా రికార్డులే కావడం విశేషం!

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,298 పాయింట్ల వద్ద, తదుపరి 12,266 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు   పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,350 వద్ద, ఆపై 12,370 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32,060 పాయింట్ల వద్ద, తదుపరి 31,943  వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు.  ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32,309 పాయింట్ల వద్ద, తదుపరి 32,440 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

స్వల్ప కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 68 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 47 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 578 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 252 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.  



You may be interested

సీఎండీ పోస్టు విభజన...మరో రెండేళ్లు పొడిగింపు

Tuesday 14th January 2020

సెబీ తాజా నిర్ణయం  న్యూఢిల్లీ: లిస్టైన కంపెనీల సీఎమ్‌డీ (చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌) పదవి విభజన గడువును మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కంపెనీల నుంచి వచ్చిన వినతులను సెబీ మన్నించింది. సెబీ నిబంధనల ప్రకారం, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా అగ్రశ్రేణి 500 లిస్టెడ్‌ కంపెనీలు సీఎమ్‌డీ పదవిని చైర్మన్‌గా, ఎమ్‌డీగా రెండుగా  విభజించాల్సి ఉంది. దీనికి గడువును ఈ ఏడాది ఏప్రిల్‌

టాటాపై వాడియా కేసు వెనక్కి

Tuesday 14th January 2020

పరువు నష్టం దావా ఉపసంహరణ న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉ‍ద్దేశమేదీ లేదని తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున

Most from this category