STOCKS

News


నిఫ్టీ మద్దతు 12,158, నిరోధం 12,214

Thursday 2nd January 2020
Markets_main1577935305.png-30600

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్లు మైనస్‌
నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,241 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,243 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. బుధవారం(1న) తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ మార్కెట్లు తదుపరి కొంతమేర మందగించాయి. చివరికి సెన్సెక్స్‌ 52 పాయింట్లు పెరిగి 41,306 వద్ద నిలవగా.. నిఫ్టీ 14 పాయింట్లు పుంజుకుని 12,183 సమీపంలో నిలిచింది. అయితే నిఫ్టీ ఫ్యూచర్‌ దాదాపు 60 పాయింట్ల ప్రీమియంతో ట్రేడవుతోంది.

ఆసియా సానుకూలం
ఈ నెల రెండో వారంలో చైనాతో వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా అమెరికా స్టాక్‌ మార్కెట్లతోపాటు, యూరొపియన్‌ మార్కెట్లు సెలవుల్లో కొనసాగుతున్నాయి. ఆసియాలోనూ జపాన్‌ మార్కెట్‌కు సెలవుకాగా.. చైనా 1.3 శాతం ఎగసింది. ఇతర మార్కెట్లలో హాంకాంగ్‌, తైవాన్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ 1-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే కొరియా 0.9 శాతం క్షీణించగా.. ఇండొనేసియా యథాతథంగా ట్రేడవుతోంది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,158 పాయింట్ల వద్ద, తదుపరి 12,133 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,214 వద్ద, ఆపై 12,247 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31991 పాయింట్ల వద్ద, తదుపరి 31879 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 32282 పాయింట్ల వద్ద, తదుపరి 32460 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

డీఐఐల పెట్టుబడులు 
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 59 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 208 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1265 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 585 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.You may be interested

ఏటీఎఫ్‌, వంట గ్యాస్‌ ధరలకు రెక్కలు

Thursday 2nd January 2020

(అప్‌డేటెడ్‌...) ఏటీఎఫ్‌ ధరలు 2.6 శాతం పెంపు సబ్సిడీలేని గ్యాస్‌ సిలిండర్‌పై రూ.19 పెంపు న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలతోపాటు, వంటగ్యాస్‌కు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు రేట్లను సవరించాయి. ఫలితంగా ఢిల్లీలో ఏటీఎఫ్‌ కిలో లీటర్‌ ధర రూ.1,637 పెరిగి రూ.64,324 అయింది. నెల వ్యవధిలో ఏటీఎఫ్‌ ధరలను పెంచడం రెండోసారి. డిసెంబర్‌ 1న కూడా కిలోలీటర్‌పై రూ.14 వరకు పెరిగింది.

వచ్చేసింది .. జియోమార్ట్‌..

Thursday 2nd January 2020

ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపారంలోకి రిలయన్స్ ప్రాథమికంగా ముంబైలో కార్యకలాపాలు షురూ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ ఈ-కామర్స్ దిగ్గజాలతో ఢీ .. ముంబై: చమురు నుంచి టెలికం దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించిన దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) తాజాగా ఆన్‌లైన్ కిరాణా వ్యాపార విభాగంలోకి కూడా ప్రవేశించింది. జియోమార్ట్ పేరిట ఈ-కామర్స్ వెంచర్‌ను ప్రారంభించింది. ప్రాథమికంగా ముంబైలోని నవీ-ముంబై, థానే, కల్యాణ్‌ ప్రాంతాల్లో ప్రారంభించిన కార్యకలాపాలను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఆఫ్‌లైన్‌-టు-ఆన్‌లైన్ వ్యాపారం

Most from this category