STOCKS

News


కొత్త ఏడాది తొలి రోజు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?

Wednesday 1st January 2020
Markets_main1577848843.png-30571

నామమాత్ర నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడింగ్‌ 

దేశీ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది తొలి రోజు(బుధవారం) అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా గత రాత్రి ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్ర నష్టంతో 12,243 వద్ద ముగిసింది.  సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా బుధవారం న్యూఇయర్‌ హాలీడే సందర్భంగా సింగపూర్‌లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడ్‌కాదు. మరోవైపు మంగళవారం ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనమై 41,254 వద్ద నిలవగా.. నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 12,169 వద్ద స్థిరపడింది. వెరసి 2019 చివరి రోజు వెనకడుగులో నిలిచాయి. కాగా.. ఈ నెల రెండో వారంలో చైనాతో వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా తెలియజేశారు. దీంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 0.3 శాతం లాభపడ్డాయి. కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా నేడు భారత్‌ మినహా ఆసియా మార్కెట్లన్నింటికీ సెలవు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,131 పాయింట్ల వద్ద, తదుపరి 12,094 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,226 వద్ద, ఆపై 12,284 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32065 పాయింట్ల వద్ద, తదుపరి 31968 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 32302 పాయింట్ల వద్ద, తదుపరి 32443 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు 
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1265 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 585 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 130.5 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 201 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.You may be interested

రూ.102 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టుల గుర్తింపు

Wednesday 1st January 2020

(అప్‌డేటెడ్‌...) ఐదేళ్లలో అమలు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ‘నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌

ఈ స్టాక్స్‌ ... టాప్‌ గన్స్‌

Wednesday 1st January 2020

అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు .. దేశీయంగా కంపెనీల ఆదాయాలు .. లిక్విడిటీ మెరుగుపడుతుండటం, డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశాలతో .. కొత్త సంవత్సరంలో మార్కెట్లకు ఊతం లభించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 2020 మరిన్ని సంస్కరణల సంవత్సరంగా ఉండవచ్చని.. 2019 ర్యాలీలో పెద్దగా పాలుపంచుకోని మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు పుంజుకోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులు, కన్జూమర్‌/ఎఫ్‌ఎంజీసీ, సిమెంట్, క్యాపిటల్‌ గూడ్స్‌ సంస్థల

Most from this category