News


నేడు అటూఇటుగా ఓపెనింగ్‌!

Tuesday 3rd March 2020
Markets_main1583205798.png-32229

సోమవారం యూఎస్‌ మార్కెట్ల దూకుడు
నామమాత్ర నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ
నేడు నిఫ్టీకి 10,968 వద్ద తొలి సపోర్ట్‌!

నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో నామమాత్రంగా 2 పాయింట్లు తక్కువగా 11,143 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,145 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ధాటికి 7 రోజులపాటు పతన బాటలో సాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. యాపిల్‌ తదితర కౌంటర్లు 5-10 శాతం మధ్య దూసుకెళ్లడంతో ఇండెక్సులు దాదాపు 5 శాతం జంప్‌చేశాయి. దీంతో దేశీయంగానూ నేడు మార్కెట్లలో ప్రోత్సాహకర వాతావరణం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రేడర్లు మరోసారి షార్ట్‌ కవరింగ్‌ చేపట్టే అవకాశమున్నట్లు చెబుతున్నారు. కాగా.. సోమవారం దేశీయంగా రెండు కరోనా వ్యాధి సోకిన కేసులు నమోదుకావడంతో ఉన్నట్లుండి మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. ఏకంగా 750 పాయింట్ల హైజంప్‌తో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివర్లో 400 పాయింట్లకుపైగా పతనమైంది. చివర్లో కోలుకున్నప్పటికీ మార్కెట్లు ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 153 పాయింట్లు క్షీణించి 38,144 వద్ద నిలిచింది. నిఫ్టీ 69 పాయింట్ల వెనకడుగుతో 11,133 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,968 పాయింట్ల వద్ద, తదుపరి 10,804 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,365 పాయింట్ల వద్ద, ఆపై 11,597 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని  తెలియజేశారు. ఇక బ్యాంక్‌  నిఫ్టీకి తొలుత 28,868 పాయింట్ల వద్ద, తదుపరి 27,858 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 29,582 పాయింట్ల వద్ద, తదుపరి 30,297 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1355 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1139 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక వారాంతాన ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1429 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 7621 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 



You may be interested

ప్రపంచ ఎకానమీకి వైరస్‌ ముప్పు!!

Tuesday 3rd March 2020

ఈ క్వార్టర్‌లో మందగించనున్న వృద్ధి దశాబ్దకాలంలో తొలిసారి ఓఈసీడీ నివేదిక ప్యారిస్‌: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కోవిడ్19 (కరోనా వైరస్‌) కారణంగా ఈ త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా మందగించనుంది. దాదాపు దశాబ్దకాలం నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత త్రైమాసికాలవారీగా చూస్తే వృద్ధి మందగించనుండటం ఇదే తొలిసారి. వైరస్‌ ప్రభావాలపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) రూపొందించిన ప్రత్యేక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచ

‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్‌ సే విశ్వాస్‌’

Tuesday 3rd March 2020

మార్చి 31లోగా చెల్లిస్తే జరిమానాలుండవు పెనాల్టీలుండవు; ఆపై క్షమాభిక్ష కూడా... ఆ తరవాత జూన్‌ 30లోగా కూడా చెల్లించొచ్చు కాకుంటే ఓ 10 శాతం ఎక్కువ చెల్లించాలి దీంతో ట్యాక్స్‌ పేయర్లకు డబ్బు, సమయం ఆదా నిర్మలా సీతారామన్‌ వెల్లడి; లోక్‌సభకు బిల్లు న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్‌ సే విశ్వాస్‌’ను బడ్జెట్‌లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

Most from this category