News


ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

Friday 10th January 2020
Markets_main1578626586.png-30811

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 6 పాయింట్లు వీక్‌
గురువారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌

నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి ఉదయం  8.40 ప్రాంతం‍లో 6 పాయింట్లు తక్కువగా 12,265 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,271 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉపశమించడంతో గురువారం​ అమెరికా స్టాక్‌ మార్కెట్లు 0.7 శాతం స్థాయిలో ఎగశాయి. వెరసి సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. మరోవైపు దేశీయంగానూ మార్కెట్లు గురువారం కదం తొక్కాయి. సెన్సెక్స్‌ 635 పాయింట్లు జంప్‌చేసి 41,452 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 191 పాయింట్లు జమ చేసుకుని 12,216 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,158 పాయింట్ల వద్ద, తదుపరి 12,099 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,249 వద్ద, ఆపై 12,282 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,782 పాయింట్ల వద్ద, తదుపరి 31,472 వద్ద సపోర్ట్‌    లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 32,288 పాయింట్ల వద్ద, తదుపరి 32,483 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 431 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 419 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 516 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 748 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు  చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

దేశ ఆర్థిక మూలాలు పటిష్టం

Friday 10th January 2020

- ఎకానమీకి పుంజుకునే సత్తా ఉంది - 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరగలం - సమిష్టి కృషితో సాధ్యమే - నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ - ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలతో భేటీ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల

ఆటోమొబైల్‌లో నియామకాల రికవరీ

Friday 10th January 2020

- నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ - డిసెంబర్‌లో 8 శాతం వృద్ధి - టైమ్స్‌జాబ్స్‌ రిక్రూట్‌ఎక్స్‌ నివేదిక న్యూఢిల్లీ: డిమాండ్ మందగమనంతో గతేడాది కుదేలైన ఆటోమొబైల్ రంగం మళ్లీ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తయారీ, విక్రయం, క్వాలిటీ కంట్రోల్‌ వంటి వివిధ విభాగాల్లో నియామకాలు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని  టైమ్స్‌జాబ్స్‌ రిక్రూట్‌ఎక్స్‌ ఒక నివేదికలో వెల్లడించింది. ఆటోమొబైల్ రంగంలో గతేడాది నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో నిపుణులకు డిమాండ్‌ 8 శాతం పెరిగిందని వివరించింది. "నియామకాల

Most from this category