News


నేడు నిఫ్టీ రెసిస్టెన్స్‌ @12140?!

Thursday 6th February 2020
Markets_main1580959273.png-31540

నామమాత్ర లాభంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ
బుధవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌
ఆసియా మార్కెట్లలో జపాన్‌, చైనా జోరు 

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 12,092 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,090 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా..  కరోనా వైరస్‌కు వాక్సిన్‌ విడుదలకానున్న అంచనాలతో బుధవారం​మరోసారి ప్రపంచ మార్కెట్లు జోరందుకున్నాయి. అమెరికా ఇండెక్సులలో డోజోన్స్‌ దాదాపు 500 పాయింట్లు జంప్‌చేయగా.. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త గరిష్ట రికార్డులను నెలకొల్పాయి. ఇక బడ్జెట్‌ తదుపరి బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల దౌడు తీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సాధించింది. బుధవారం 353 పాయింట్లు జమ చేసుకుని 41,143 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు ఎగసి 12,089 వద్ద స్థిరపడింది. అయితే సెన్సెక్స్‌ 3 రోజుల్లో 1400 పాయింట్లకుపైగా జంప్‌చేయడంతో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదలవచ్చని తెలియజేశారు. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. జపాన్‌ 2 శాతం, చైనా 1 శాతం చొప్పున ఎగశాయి.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,996 పాయింట్ల వద్ద, తదుపరి 11,902 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,140 వద్ద, ఆపై 12,192 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక  బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,733 పాయింట్ల వద్ద, తదుపరి 30,464 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత  31,168 పాయింట్ల వద్ద, తదుపరి 31,334 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 249 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 263 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 366 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 602 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. You may be interested

ధూమ్‌ షో 2020

Thursday 6th February 2020

హంగామా షురూ.. లాంఛనంగా ఆటో ఎక్స్‌పో 2020 ప్రారంభం 7–12 దాకా సందర్శకులకు ఎంట్రీ పాల్గొంటున్న దేశ, విదేశీ వాహన దిగ్గజాలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటో ఎక్స్‌పో 2020 మోటార్‌ షో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి రెండు రోజుల్లో వ్యాపార వర్గాలను  అనుమతించనుండగా.. 7 నుంచి 12 దాకా సామాన్య ప్రజలు కూడా సందర్శించవచ్చు. దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థలు ఇందులో తమ

ఇన్‌ఫ్రాపై ఫోకస్‌.. ఈ కంపెనీలకు బోలెడు అవకాశాలు

Thursday 6th February 2020

మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. నూతనంగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి ప్రతిపాదనలకూ చోటిచ్చింది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలు ఆయా రంగాల్లోని కంపెనీలకు వ్యాపార అవకాశాలను తెచ్చిపెట్టేవే. ఈ నేపథ్యంలో మౌలికరంగం, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులతో లాభపడే కంపెనీల వివరాలను పలు బ్రోకరేజీ సంస్థలు ప్రకటించాయి.   ఎల్‌అండ్‌టీ, అశోక బిల్డ్‌కాన్‌ సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఈ రెండు కంపెనీలకు అధిక వ్యాపార అవకాశాలు వచ్చిపడతాయని అంచనా వేస్తోంది. రైట్స్‌, సీమెన్స్‌,

Most from this category