News


నేడు మార్కెట్‌ అక్కడక్కడే?

Thursday 23rd January 2020
Markets_main1579749367.png-31120

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 4 పాయింట్లు మైనస్‌

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 4 పాయింట్లు తక్కువగా 12,145  వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,149 వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించిన నేపథ్యంలో వరుసగా మూడో రోజు బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తావించగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 208 పాయింట్లు క్షీణించి 41,115 వద్ద నిలవగా.. నిఫ్టీ 63 పాయింట్ల నష్టంతో 12,107  వద్ద స్థిరపడింది. అయితే బడ్జెట్‌పై  అంచనాలు పెరగడంతో తొలుత దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వర్ధమాన దేశాలలో ఇండియా ఆర్థిక వృద్ధి సైతం మరింత నీరసించనున్నట్లు తాజా అంచనాలలో పేర్కొనడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు దాదాపు యథాతథంగా ముగియడం గమనార్హం! చైనాలో న్యుమోనియాను కలుగజేసే వైరస్‌ వ్యాపిస్తున్న కారణంగా ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు వరుసగా మూడు రోజులపాటు నష్టాల బాటలో కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,055 పాయింట్ల వద్ద, తదుపరి 12,003 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,192 వద్ద, ఆపై 12,277 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,494 పాయింట్ల వద్ద, తదుపరి 30,286 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,029 పాయింట్ల వద్ద, తదుపరి 31,357 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాల బాట
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 176 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 326 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 50 కోట్లు,  డీఐఐలు​రూ. 308 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు కేవలం రూ. 6 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1420 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! You may be interested

ఫ్రిజ్‌లోనే పెరుగు రెడీ..

Thursday 23rd January 2020

శాంసంగ్ కొత్త రిఫ్రిజిరేటర్లు 'కర్డ్ మేస్ట్రో' న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తాజాగా కొత్త రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. పెరుగు తోడుపెట్టే బాదరబందీ లేకుండా చేసే 'కర్డ్ మేస్ట్రో' ఫ్రిజ్ కూడా వీటిలో ఉంది. పాలు.. పెరుగుగా మారడంలో కీలకమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియను ఆటోమేటిక్‌గా నిర్వహించే టెక్నాలజీని శాంసంగ్ ఈ ఫ్రిజ్‌లో పొందుపర్చింది. ఇందుకోసం ఫ్రిజ్‌లో ప్రత్యేక అర ఉంటుంది. అయిదు నుంచి ఆరు గంటల్లో పెరుగు సిద్ధమవుతుందని సంస్థ

మళ్లీ మార్కెట్లోకి ‘వాక్‌మాన్‌’

Thursday 23rd January 2020

టచ్‌స్క్రీన్‌తో అందిస్తున్న సోనీ ఇండియా ధర రూ. 23,990 న్యూఢిల్లీ: అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్ ధాటికి కనుమరుగైన వ్యాక్‌మాన్‌లను (పోర్టబుల్‌ పర్సనల్ క్యాసెట్ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్‌స్క్రీన్‌ సదుపాయంతో ఆండ్రాయిడ్ వాక్‌మాన్ ఎన్‌డబ్ల్యూ-ఎ105 మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6

Most from this category