News


నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?

Monday 20th January 2020
Markets_main1579490876.png-31036

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 7 పాయింట్లు ప్లస్‌

నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 7 పాయింట్ల స్వల్ప లాభంతో 12,384 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,377 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వివాద పరిష్కారంలో భాగంగా చైనాతో వాణిజ్య ప్రాథమిక దశ డీల్‌ కుదుర్చుకున్న నేపథ్యంలో శుక్రవారం వరుసగా మూడో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. కాగా.. వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలి చివరికి అటూఇటుగా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 13 పాయింట్లు బలపడి 41,945 పద్ద నిలవగా.. నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర నష్టంతో 12,352 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, దీంతో నేడు కూడా మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,321 పాయింట్ల వద్ద, తదుపరి 12,289 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు      పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,385 వద్ద, ఆపై 12,417 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,433 పాయింట్ల వద్ద, తదుపరి 31,275  వద్ద సపోర్ట్‌     లభించవచ్చని అంచనా వేశారు.  ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,761 పాయింట్ల వద్ద, తదుపరి 32,931 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాలవైపు..డీఐఐలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 264 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 395 కోట్లు, డీఐఐలు రూ. 185 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.   You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 20th January 2020

బంధన్‌ బ్యాంక్‌:-  కొనొచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ:- ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర:- రూ.481 టార్గెట్‌ ధర:- రూ.650 ఎందుకంటే:- ‍ఈ ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. కీలకమైన సూక్ష్మ రుణాల విభాగంలో తాజా మొండి బకాయిలు పెద్దగా లేవు. అయినప్పటికీ, అదనంగా రూ.200 కోట్ల కేటాయింపులు జరిపింది. గృహ్‌ ఫైనాన్స్‌ విలీనం తర్వాత రుణ నాణ్యత ఒకింత తగ్గినా, మెరుగైన స్థితిలోనే ఉంది.  నిర్వహణ ఆస్తులు

బాండ్లలో స్థిరమైన రాబడులు

Monday 20th January 2020

బాండ్లలో స్థిరమైన రాబడులు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌సీజన్స్‌ బాండ్‌ ఫండ్‌ దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు చేరింది. అదే సమయంలో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గడం ద్రవ్యలోటుపై భారాన్ని మోపేదే. ఇదంతా బాండ్‌ మార్కెట్‌పై ప్రతిఫలిస్తుంది. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ బాండ్ల పరంగా అధిక సరఫరా నెలకొనే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రభుత్వం అధికంగా రుణ సమీకరణ చేస్తే అది బాండ్‌ మార్కెట్‌పై తప్పకుండా

Most from this category