News


నిఫ్టీ మద్దతు 12,183, అవరోధం 12,265

Thursday 26th December 2019
Markets_main1577330786.png-30444

నామమాత్ర లాభంతో కదులుతున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 12,236 వద్ద ట్రేడవుతోంది. క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయలేదు. అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లకు సైతం సెలవు. ఇక ప్రస్తుతం ఆసియాలో జపాన్‌, థాయ్‌లాండ్‌,  చైనా, ఇండొనేసియా 0.4-0.2 శాతం మధ్య​పుంజుకోగా.. కొరియా యథాతథంగా ట్రేడవుతోంది. ఇతర మార్కెట్లలో సింగపూర్‌ 0.4 శాతం క్షీణించింది.  హాంకాంగ్‌, ఆస్ట్రేలియా మార్కెట్లకు సెలవు. కాగా.. మంగళవారం అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ 181 పాయింట్లు క్షీణించి 41,461 వద్ద నిలవగా.. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 12,215 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు మరోసారి బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,183 పాయింట్ల వద్ద, తదుపరి 12,152 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,265 వద్ద, ఆపై 12,315 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32221 పాయింట్ల వద్ద, తదుపరి 32162 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 32365 పాయింట్ల వద్ద, తదుపరి 32450 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

అమ్మకాలవైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 114 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 345 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1463 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1947 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.



You may be interested

ప్రారంభంలో సెన్సెక్స్‌ ప్లస్‌, నిఫ్టీ మైనస్‌

Thursday 26th December 2019

ఎటువంటి అంతర్జాతీయ సంకేతాలు వెలువడకపోవడంతో క్రిస్మస్‌ సెలవు అనంతరం గురువారం స్టాక్‌ సూచీలు దాదాపు స్థిరంగా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 41,543 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 12,211 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

గ్యాస్ వివాదాలపై నిపుణుల కమిటీ

Thursday 26th December 2019

- సత్వర పరిష్కారమార్గాలపై కేంద్రం దృష్టి న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. సుదీర్ఘ న్యాయపోరు సమస్యలు లేకుండా నిర్దిష్ట కాలవ్యవధిలోగా ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తి సంబంధ వివాదాల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఇందులో చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఆయిల్ ఇండియా మాజీ సీఎండీ బికాష్ సి

Most from this category