News


నేడు సానుకూల ఓపెనింగ్‌- తదుపరి?!

Monday 3rd February 2020
Markets_main1580701257.png-31451

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు ప్లస్‌
శుక్రవారం యూఎస్‌ మార్కెట్ల పతనం
ప్రస్తుతం కుప్పకూలిన చైనీస్‌ షాంఘై ఇండెక్స్‌

నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 32 పాయింట్లు పుంజుకుని 11,686  వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,654 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటం,  అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అత్యయిక పరిస్థితిని ప్రకటించడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు 2 శాతం పతనంకాగా.. ప్రస్తుతం చైనా షాంఘై ఇండెక్స్‌ 8 శాతం కుప్పకూలింది. 2015 ఆగస్ట్‌ తదుపరి ఇది భారీ పతనంకాగా.. దేశీయంగా కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సైతం భారీ అమ్మకాలతో కుప్పకూలాయి. వెరసి సెన్సెక్స్‌ 988 పాయింట్లు కోల్పోయి 39,735 వద్ద నిలవగా.. నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయి 11,662 వద్ద స్థిరపడింది. ఫలితంగా సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల దిగువకు చేరింది. తాజాగా చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ రెపో కోత ద్వారా 174 బిలియన్‌ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రకటించిన నేపథ్యంలో శనివారం పతనమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,568 పాయింట్ల వద్ద, తదుపరి 11,500 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,801 వద్ద, ఆపై 11,862 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 28,676 పాయింట్ల వద్ద, తదుపరి 28,485 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,164 పాయింట్ల వద్ద, తదుపరి 30,381 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1200 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) కేవలం‍ రూ. 37 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 962 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 292 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. You may be interested

దేశీ ఆదాయంపైనే పన్ను

Monday 3rd February 2020

ఎన్‌ఆర్‌ఐ టాక్స్‌పై ఆర్థిక శాఖ వివరణ గల్ఫ్‌ దేశాలు, మర్చంట్ నేవీలో పనిచేసే వారికి ఊరట న్యూఢిల్లీ:  ప్రవాస భారతీయుల (ఎన్నారై) ఆదాయాలపై పన్ను విధించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఎన్నారైలు భారత్‌లో ఆర్జించిన ఆదాయాలపై మాత్రమే దేశీయంగా పన్ను విధింపు ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇతర దేశాల్లో వారికి వచ్చే ఆదాయాలపై ట్యాక్స్ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. "ఎన్నారైలకు భారత్‌లో వచ్చిన ఆదాయాలపై

39,630 దిగువన మరింత పతనం

Monday 3rd February 2020

ఒకవైపు కరోనా వైరస్‌ సంక్షోభంలో విలవిలలాడుతున్న మార్కెట్‌కు వారాంతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. జీడీపీ వృద్ధి రేటును  పెంచడానికి పలు పోత్సాహకాలు ప్రకటిస్తారన్న మార్కెట్‌ అంచనాలు తల్లకిందులుకావడంతో ఇన్వెస్టర్లు ఎడాపెడా విక్రయాలు జరిపారు. ఈ షాక్‌ను పూర్తిగా  డిస్కౌంట్‌ చేసుకోవడానికి మరికొన్ని రోజలు మార్కెట్‌కు పట్టవచ్చు. ఇందుకుతోడు కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగితే డౌన్‌ట్రెండ్‌ తీవ్రతరమయ్యే ప్రమాదం వుంటుంది.     ఇక సూచీల

Most from this category