News


ఈ ఏడాది మార్కెట్ల నుంచి 9% రిటర్న్స్‌?

Thursday 16th January 2020
Markets_main1579168812.png-30968

ఈ కేలండర్‌ ఏడాది(2020) దేశీ స్టాక్‌ మార్కెట్లు 8-9 శాతం స్థాయిలో రిటర్నులు అందించే వీలున్నట్లు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌.. ఈక్విటీ విభాగం సీఐవో మహేష్‌ పాటిల్‌ అంచనా వేస్తున్నారు. 2019ని ప్రతిబింబిస్తూ ఈ ఏడాది కూడా లార్జ్‌ క్యాప్స్‌ జోరు చూపవచ్చని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..

ఆర్థిక రికవరీ 
వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ ఆర్జన 21 శాతం జంప్‌చేయవచ్చు. కార్పొరేట్‌ బ్యాంకులు ఇందుకు ప్రధానంగా సహకరించే వీలుంది. ఆర్థిక రికవరీ ఊపందుకుంటే కన్సాలిడేషన్‌ జరగవచ్చు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ పెద్దగా జోరు చూపకపోవచ్చు. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటే.. మధ్య, చిన్నతరహా కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చు. ఫలితంగా నాణ్యమైన కంపెనీలు జోరందుకునే అవకాశముంది. కొంతకాలం వేచిచూడగలిగితే.. మిడ్‌, ‍స్మాల్‌ క్యాప్స్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం పరిగణించవచ్చు.

విదేశీ రిస్కులు
విదేశీ అంశాలకొస్తే.. దేశీ మార్కెట్లకు చమురు ధరలు, జియోపొలిటికల్‌ టెన్షన్లు తదితర రిస్కులు ఎదురుకావచ్చు. దేశీయంగా పలు మధ్యస్థాయి కార్పొరేట్‌ కంపెనీలు, ఎస్‌ఎంఈలు, రిటైల్‌ నుంచి బ్యాంకులకు మొండి బకాయిల సమస్యలు ఎదురుకావచ్చు. ఎన్‌పీఏలు పెరిగితే ఆర్థిక రికవరీకి దెబ్బతగిలే అవకాశముంది. ఇకపై కూడా ప్రయివేట్‌ బ్యాంకులు, బీమా కంపెనీలు మంచి రిటర్నులు అందించవచ్చు. ఇన్‌ఫ్రా, రియల్టీ రంగాలు పుంజుకుంటే సిమెంట్‌ కంపెనీలు సైతం మెరుగైన పనితీరు ప్రదర్శించే అవకాశముంది. ఇక అమెరికా మార్కెట్లలో ఎక్స్‌పోజర్‌ కలిగిన ఫార్మా కంపెనీలు సైతం తిరిగి వృద్ధి బాటపట్టవచ్చని భావిస్తున్నాం. రెండుమూడేళ్లలో టెలికం రంగ దిగ్గజాలు సైతం క్యాష్‌ఫ్లోలను మెరుగుపరచుకునే వీలుంది. 

పెట్టుబడులు ఇలా
ఇన్వెస్టర్లు తమ పెట్టులబడుల్లో 25 శాతాన్ని లార్జ్‌ క్యాప్స్‌ కోసం, 35 శాతాన్ని మల్టీక్యాప్స్‌ కోసం కేటాయించవచ్చు. ఈ బాటలో 20 శాతాన్ని మిడ్‌ క్యాప్స్‌లో వెచ్చించవచ్చు. ఇక మిగిలిన 20 శాతం పెట్టుబడులను ఫార్మా, బ్యాంకింగ్‌, ఎంఎన్‌సీ వంటి థీమ్‌ ఆధారిత ఫండ్స్‌కు మళ్లించడం మేలని భావిస్తున్నాం.You may be interested

15వేల బ్యాంకు శాఖల ఏర్పాటుకు కేంద్రం ఆదేశం

Thursday 16th January 2020

దేశంలో అందరికీ బ్యాంకింగ్‌ సేవల్ని విస్తరించేందుకు కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 15వేల కొత్త శాఖల్ని ఏర్పాటు చేయాలని బ్యాంకింగ్‌ రంగ దిగ్గజాలను కోరినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని గ్రామాల్లో ప్రతి 15 కిలోమీటర్ల పరిధిలో ఒక కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఏయే ప్రాంతాల్లో  శాఖల్ని ఏర్పాటు చేయాలనే అంశంపై తుది జాబితా

వొలాటిలిటీలోనూ ఈ షేర్ల లాభాల దౌడు

Thursday 16th January 2020

జాబితాలో వొకార్డ్‌, మహానగర్‌ గ్యాస్‌ టొరంట్‌ ఫార్మా, ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ చరిత్రాత్మక గరిష్టానికి నెస్లే ఇండియా అగ్ర దేశాలు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం కుదిరినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌, యుటిలిటీస్‌ కంపెనీ మహానగర్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా, ఈ

Most from this category