News


టెన్షన్లున్నా మార్కెట్లు ముందుకే!

Saturday 4th January 2020
Markets_main1578125929.png-30675

2020లో దేశీ మార్కెట్లపై అంచనాలు
ఉమేష్‌ మెహతా, శామ్‌కో సెక్యూరిటీస్‌

అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక ఆందోళనలున్నప్పటికీ ఈ ఏడాది(2020)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల పరుగు తీయనున్నట్లు విశ్లేషకులు ఉమేష్‌ మెహతా అంచనా వేస్తున్నారు. టెన్షన్లు ఉన్నప్పటికీ గతేడాదితో పోలిస్తే మార్కెట్లు మంచి రిటర్నులు అందించే వీలున్నట్లు పేర్కొన్నారు. శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన ఇతర అభిప్రాయాలు చూద్దాం.. 

ఇటీవల ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ సరికొత్త గరిష్టానికి చేరువైనప్పటికీ ఇరాన్‌పై అమెరికా డ్రోన్‌ దాడుల నేపథ్యంలో వెనకడుగు వేసింది. అయితే ఇలాంటి టెన్షన్ల కారణంగా మార్కెట్లలో నెలకొన్న బుల్‌ ర్యాలీ పట్టాలుతప్పే అవకాశాలు తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు ఉన్నట్టుండి పతనమైతే.. అవకాశాలను అంది పుచ్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. జియో పొలిటికల్‌ ఆందోళనలు స్వల్ప కాలిక ట్రిగ్గర్లుగా మాత్రమే పనిచేస్తాయి. దీంతో స్వల్ప కాలానికే మార్కెట్లు ప్రభావితం అవుతాయి. దేశీ మార్కెట్లు సైతం ​సమాయనుగుణంగా దిద్దుబాట్లను(కరెక్షన్లు) చవిచూస్తాయి. అయితే 2019తో పోలిస్తే.. 2020లో మార్కెట్లు బాగా మెరుగైన రిటర్నులు ఇచ్చే అవకాశముంది.

12,130 వద్ద సపోర్ట్‌
వచ్చే వారానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 12,130 వద్ద పటిష్ట మద్దతు(సపోర్ట్‌) లభించే వీలుంది. ఈ స్థాయికంటే దిగువకు చేరితే ఒక్కసారిగా లాభాల స్వీకరణ జరిగే అవకాశముంది. కాగా.. ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ఇంధన రంగ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా లబ్ది పొందవచ్చు. అధిక చమురు ధరలవల్ల ఈ కంపెనీల రియలైజేషన్లు మెరుగుపడతాయి.

అమెరికా- చైనా డీల్‌
ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సాధారణ బడ్జెట్‌కంటే ముందుగా.. బాండ్ల ఈల్డ్స్‌లో కదలికలు నమోదుకాకపోవచ్చు. ఇదే విధంగా కరెన్సీ, కరెన్సీ మారకపు రేట్లలోనూ పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవచ్చు. అయితే అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పంద పరిస్థితులు ఈ వారం కీలకంగా నిలిచే వీలుంది.

బడ్జెట్‌ అంచనా
డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను ప్రభుత్వం సాధించవలసి ఉంది. మరోవైపు ఇటీవల 4.5 శాతానికి నీరసించిన జీడీపీ వృద్ధికి ఊతమిచ్చే చర్యలను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించే అవకాశముంది. ఇన్వెస్టర్లు ఇలాంటి పలు సానుకూల అంశాలను బడ్జెట్‌నుంచి ఆశిస్తుండవచ్చు.



You may be interested

గృహరుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల తగ్గింపు

Saturday 4th January 2020

ప్రైవేటు రంగ రుణ దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించేసింది. కొత్త కస్టమర్లను పొందేందుకు, ప్రస్తుత కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ లోన్స్‌పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు తగ్గింపుతో అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఈ తగ్గింపు నిర్ణయం జనవరి 6 నుంచి అమలులోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ ఒక

బంగారం మరింత పెరిగి ఛాన్స్‌..!?

Saturday 4th January 2020

గడచిన ఏడాదిలో పసిడిని కొనుగోలును నిర్లక్ష్యం చేసిన ఇన్వెస్టర్లు 18శాతం రాబడిని కోల్పోయానే నిరాశ చెందాల్సిన పని లేదు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, ఈ ఏడాది ఆరంభంలో పసిడి కొనుగోలు చేస్తే సంవత్సరాంతం కల్లా 25శాతం రాబడిని పొందవచ్చని బులియన్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. పలు దేశాల కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌లు పసిడి నిల్వల కొనుగోలుకు మొగ్గు చూపుతుండటం, అమెరికా కరెన్సీ డాలర్‌ బలహీనత, అంతర్జాతీయంగా విస్తరిస్తున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో

Most from this category