News


నేడు మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌!

Monday 2nd March 2020
Markets_main1583119501.png-32195

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 128 పాయింట్లు జూమ్‌
నేడు నిఫ్టీకి 11123 వద్ద తొలి సపోర్ట్‌!
గత వారం అమెరికా మార్కెట్ల రికార్డ్‌ పతనం 

 

నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో  128  పాయింట్లు జంప్‌చేసి 11,286 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,158 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు బలహీనపడే పరిస్థితులు కనిపిస్తుండటంతో శుక్రవారం ఒక్కసారిగా ఇన్వెస్టర్లలో భయాలు ఆవహించాయి. వెరసి అమెరికా, యూరోప్‌, ఆసియా మార్కెట్లు అమ్మకాలతో కుప్పకూలాయి. 2008 తరువాత అమెరికా మార్కెట్లు గత వారం అత్యధిక పతనాన్ని చవిచూడగా.. దేశీయంగానూ మార్కెట్లు గత వారం 7 శాతం తిరోగమించాయి. వారాంతాన ఒక్క రోజులోనే సెన్సెక్స్‌ 1448  పాయింట్లు కుప్పకూలింది. 38,297 వద్ద నిలవగా.. 431 పాయింట్లు పడిపోయి నిఫ్టీ 11,202 వద్ద స్థిరపడింది. దీంతో నేడు ట్రేడర్లు భారీ స్థాయిలో షార్ట్‌ కవరింగ్‌కు దిగే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇన్వెస్టర్లు చౌకగా లభిస్తున్న కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపే వీలున్నట్లు చెబుతున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,123 పాయింట్ల వద్ద, తదుపరి 11,044 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,333 పాయింట్ల వద్ద, ఆపై 11,464 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని  తెలియజేశారు. ఇక బ్యాంక్‌  నిఫ్టీకి తొలుత 28,944 పాయింట్ల వద్ద, తదుపరి 28,742 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా  బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 29,457  పాయింట్ల వద్ద, తదుపరి 29,767 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1429 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ  ఫండ్స్‌(డీఐఐలు) రూ. 7621 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 



You may be interested

‘‘కోవిడ్‌’’పైనే దృష్టి..!

Monday 2nd March 2020

ఏడేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి, 4.7 శాతానికే పరిమితం తగ్గిన మారుతీ అమ్మకాలు.. కొనసాగుతోన్న మందగమనం సోమవారం తయారీ, బుధవారం సేవా రంగాల డేటా వెల్లడి ఈ వారంలోనూ కోవిడ్–19 (కరోనా) వైరస్ పరిణామాలే నడిపిస్తాయ్‌.. న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్.. చైనా నుంచి మొదలుకుని అమెరికా స్టా్క్‌ మార్కెట్‌ వరకు అన్ని దేశాల ప్రధాన సూచీలను కుప్పకూల్చేసింది. ఈ వైరస్‌ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా బుల్స్‌

ఏడాది కనిష్టానికి 13 పీఎస్‌బీలు.. కొనే సమయమా?

Monday 2nd March 2020

ప్రభుత్వరంగ సంస్థల స్టాక్‌ ధరలు వాటి వాస్తవ విలువను ప్రతిబింబించడం లేదు. ఇటీవలి ర్యాలీల్లో ప్రభుత్వరంగంలోని లిస్టెడ్‌ సంస్థల్లో (పీఎస్‌యూలు) 95 శాతం వరకు పాలుపంచుకోలేదు, సరికదా.. అవి మరింత పతనం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) మరీ నిరాశపరుస్తున్నాయి. పీఎస్‌బీల షేర్లు వాటి మార్కెట్‌ విలువలో సగానికి పైగా నష్టపోయినవే. ఎక్కువ భాగం మూడింట రెండొంతులు విలువను కోల్పోయాయి. వరుస విలీనాలు, భారీ ఎన్‌పీఏలు, పనితీరు

Most from this category