News


నిఫ్టీ 40 పాయింట్లు గ్యాప్‌డౌన్‌

Tuesday 18th December 2018
Markets_main1545105635.png-23015

  • నష్టాల్లో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు
  • 10,850 దిగువకు నిఫ్టీ
  • సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా డౌన్‌

సోమవారం లాభాలతో కళకళలాడిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,888 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల నష్టంతో 10,850 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,270 పాయింట్లతో పోలిస్తే 44 పాయింట్ల నష్టంతో 36,226 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్ల నష్టంతో 36,115 వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 10,840 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఆర్‌బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి వల్ల బ్యాంకింగ్‌ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని.. దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ హెచ్చరించడం, అమెరికా నిల్వలు పెరగడం వల్ల క్రూడ్‌ ధరలు మంగళవారం 1 శాతం మేర క్షీణించడం, ఇండియన్‌ రూపాయి సోమవారం 34 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.56 వద్ద ముగియడం, మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల నుంచి ఏఎంసీలు వసూలు చేసే చార్జీలకు కోత విధిస్తూ సెబీ నూతన నిబంధనలను విడుదల చేయడం,  ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాలతో ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు సోమవారం పతనమవ్వడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వు పాలసీ సమావేశం వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

నిఫ్టీ-50లో టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హీరో మోటొకార్ప్‌, యూపీఎల్‌, ఐఓసీ, ఎంఅండ్‌ఎం, ఏసియన్‌ పెయిం‍ట్స్‌ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 2 శాతానికి పైగా పడిపోయింది. ఇన్ఫోసిస్‌ దాదాపు 2 శాతం మేర క్షీణించింది. విప్రో, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. ఇక టాటా మోటార్స్‌ దాదాపు 2 శాతం మేర పెరిగింది. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, హీరో మోటొకార్ప్‌ షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. 

ఒక్క నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 18th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టాటాస్టీల్‌:- జర్మన్‌ ఉక్కు దిగ్గజం థీస్సెన్‌క్రూప్‌ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే జాయింట్‌ వెంచర్‌ కంపెనీకి సీఈవోగా ఆండ్రియాస్‌ గాస్‌ను నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ఏర్పాటు కాబోతున్న థీస్సెన్‌క్రూప్‌టాటాస్టీల్‌ బి.వి.కి సంబంధించిన మేనేజెమెంట్‌ బోర్డు సభ్యులను నియమించినట్లు టాటాస్టీల్‌ ఎక్చ్సేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఎన్‌ఎండీసీ:- ఐరన్‌ ఓర్‌ ధరలను పెంచింది. టన్ను లూప్‌ ఓర్‌ ధర రూ.3250 కోట్లు, ఫైన్స్‌ ఓర్‌ ధర రూ.2870లుగా

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 18th December 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 46 పాయింట్ల నష్టంతో 10,867 పాయింట్ల వద్ద ఉంది.  ♦ఆర్‌బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్‌ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ

Most from this category