News


మార్కెట్‌కు రూపీ, క్రూడ్‌ బూస్ట్‌..

Wednesday 19th December 2018
Markets_main1545191903.png-23055

  • 10,950 పైకి నిఫ్టీ
  • సెన్సెక్స్‌ 100 పాయింట్లు అప్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ జోరుమీదుంది. గత రెండు రోజూలు లాభాల్లో ముగిసిన ఇండెక్స్‌లు బుధవారం కూడా గ్యాప్‌అప్‌తోనే ప్రారంభమయ్యాయి. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,908 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 10,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,347 పాయింట్లతో పోలిస్తే 94 పాయింట్ల లాభంతో 36,441 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ లాభాలు కూడా పెరిగాయి. ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 36,464 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 10,948 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో 10,955 స్థాయిని కూడా తాకింది. 

ఇండియా వోలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 4.32 శాతం క్షీణతతో 14.50 స్థాయికి క్షీణించడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వడ్డీ రేట్లు పెంచి మళ్లీ తప్పు చేయవద్దని ఫెడరల్‌ రిజర్వును హెచ్చరించడం, ఓవర్‌ సప్లై సహా డిమాండ్‌ తగ్గుదల భయాలకు తోడు అమెరికాలో నిల్వలు పెరగడం వల్ల క్రూడ్‌ ఆయిల్‌ ధర మంగళవారం ఏకంగా 5 శాతం మేర క్షీణించడం, నిఫ్టీ 50 ఇండెక్స్‌లో వీక్లి ఆప్షన్స్‌ ప్రారంభించేందుకు ఎన్‌ఎస్‌ఈకి సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 18న ఏకంగా 112 పైసలు మేర లాభపడి.. అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.44 వద్ద క్లోజవ్వడం, కార్పొరేట్‌ బాం‍డ్లకు వ్యాల్యుయేషన్‌ నిబంధనలను అమలు పరిచేందుకు సెబీ రెడీ అవుతుండటం, లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించి డిఫరెన్షియల్‌ ఓటింగ్‌ రైట్‌ షేర్లను (డీవీఆర్‌) తిరిగి ప్రారంభించేందుకు సెబీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగియడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయం నేడు అర్ధ రాత్రి వెలువడనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌ 1 శాతానికి పైగా నష్టపోయింది. టీసీఎస్‌ కూడా దాదాపు ఒక శాతం మేర క్షీణించింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 3 శాతానికి పైగా ఎగసింది. హెచ్‌పీసీఎల్‌ 2 శాతానికి పైగా లాభపడింది. ఏసియన్‌ పెయింట్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, యస్‌ బ్యాంక్‌ షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. 

ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1 శాతానికి పైగా పెరిగింది. 

 You may be interested

రూపీ రయ్‌.. రయ్‌..

Wednesday 19th December 2018

70 మార్క్‌ దిగువున్న ట్రేడ్‌ అవుతోన్న దేశీ కరెన్సీ ఇండియన్‌ రూపాయి వేగంగా రికవరీ అవుతోంది. బుధవారం కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, బహిరంగ మార్కెట్‌లో బాండ్లను కొనుగోలు చేస్తామని మళ్లీ ఆర్‌బీఐ ప్రకటించడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం 70.08 వద్ద ప్రారంభమైంది. రూపాయి బలపడుతూ రావడం ఇది వరుసగా మూడో

స్టాక్‌ మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Wednesday 19th December 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 39 పాయింట్ల లాభంతో 10,994 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఇండియా వోలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 4.32 శాతం క్షీణతతో 14.50 స్థాయికి క్షీణించింది. వీఐఎక్స్‌ గత ఐదు సెషన్లలో 32 శాతం మేర పతనమైంది. ఇది మార్కెట్‌పై బుల్స్‌ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.  ♦ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌

Most from this category