News


లాభాల ప్రారంభం

Friday 28th September 2018
Markets_main1538106926.png-20654

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,324 పాయింట్లతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో 36,452 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,977 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో 11,008 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, వచ్చే రెండేళ్ల కాలంలో అమెరికా ఎలాంటి చెప్పుకోదగ్గ మాం‍ద్యం పరిస్థితులను ఎదుర్కొకపోవచ్చని ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అంచనా వేయడం, డబ్ల్యూటీవో 2019 గానూ వాణిజ్య వృద్ధి అంచనాలను 4.4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గించడం, భౌగోళిక రాజకీయ అస్థిరతలు సహా వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతినిందని.. దీంతో గ్లోబల్‌గా ఐపీవోలు తగ్గాయని ఎర్నె‍స్ట్‌ అండ్‌ యంగ్‌ పేర్కొనడం, ఐదో విడత ఎలక్ట్రోరల్‌ బాండ్లను అక్టోబర్‌ 1 నుంచి 10 వరకు విక్రయిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేయడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం ఫ్లాట్‌గా 72.59 వద్ద ముగియడం, మార్కెట్లో చోటుచేసుకున్న లిక్విడిటీ సమస్య నేపథ్యంలో ఆర్‌బీఐ.. మ్యూచువల్‌ ఫండ్లకు ప్రత్యేకమైన విండోను ఏర్పాటు చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెకి మిస్త్రీ కోరడం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ శుక్రవారం మార్కెట్‌లో లిస్ట్‌ కానుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏసియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. యస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా నష్టపోయాయి.   You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 28th September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు కిర్లోస్కర్‌ ఇండస్ట్రీస్‌:- పారిశ్రామిక ప్రయోజనాల నిమిత్తం 675 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కించుకుంది. డీబీ రియల్టీ:- నీల్‌కమల్‌ రియల్టీ టవర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మొత్తం వాటాను కొనుగోలు చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు:- ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.5431 కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌:- షేర్ల

మార్కెట్‌ ఎటు?

Friday 28th September 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 55 పాయింట్ల (0.21 శాతం) లాభంతో 26,439 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 8 పాయింట్ల (0.28 శాతం) లాభంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 52 పాయింట్ల (0.65 శాతం) లాభంతో 8,041 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు అమెరికా ఆర్థిక

Most from this category