News


రివర్స్‌ గేర్‌లో మార్కెట్‌

Thursday 27th September 2018
Markets_main1538037644.png-20645

స్టాక్‌ మార్కెట్‌ రివర్స్‌ గేర్‌ తీసుకుంది. లాభాలతో ప్రారంభమైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 11,000 మార్క్‌ దిగువకు వచ్చేసింది. మధ్యాహ్నాం 1:56 సమయంలో సెన్సెక్స్‌ 205 పాయింట్ల నష్టంతో 36,338 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 10,979 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఎఫ్‌అండ్‌వో ఫ్యూచర్స్‌ ఎక్స్‌పైరీ, క్రూడ్‌ ధరల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ ఆందోళనలు, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కోల్పోవడం, ఫెడ్‌ రేట్ల పెంపు వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొంటున్నారు. 
నిఫ్టీ-50లో టైటాన్‌, టాటా స్టీల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఏసియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, గెయిల్‌ షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి. మరోవైపు యస్‌ బ్యాంక్‌ ఏకంగా 7 శాతానికిపైగా పతనమైంది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 6 శాతానికిపైగా పడిపోయింది. ఇక బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి. మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 2 శాతానికిపైగా తగ్గాయి. 
సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు లాభాల్లో ఉన్నాయి. మిగతావన్నీ నష్టల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ గరిష్టంగా దాదాపు 3 శాతంమేర క్షీణించింది. 

కాగా గురువారం ఉదయం సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,542 పాయింట్లతో పోలిస్తే 149 పాయింట్ల లాభంతో 36,691 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,053 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 11,079 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.



You may be interested

దిగుమతి సుంకాల ఎఫెక్ట్‌: నష్టాల్లో కన్జ్యూమర్‌ షేర్లు

Thursday 27th September 2018

ముంబై:- దిగుమతి సుంకాల పెంపుతో కన్జ్యూమర్‌ షేర్లకు కష్టాలు మొదలయ్యాయి. సుంకాల పెంపుతో రానున్న రోజుల్లో మార్జిన్లు తగ్గితాయని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన దిగుమతుల సుంకాలతో రూపాయి విలువ క్షీణించినప్పటికీ, దిగుమతులు భారీ తగ్గే అవకాశం ఉంది. వినిమయ వస్తువులపై పెంచిన దిగుమతి సుంకాల ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. విద్యుత్‌ ఉపకరణాల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10శాతం సుంకాన్ని

నాలుగు ఎన్‌బీఎఫ్‌సీలపై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Thursday 27th September 2018

సాధారణంగా మార్కెట్లో అందరూ భయపడే వేళ కొనుగోళ్లకు మంచి తరుణమని నిపుణుల సూచిస్తుంటారు. అయితే నిప్పు లేనిదే పొగరాదని, అందువల్ల ఇటీవల నెగిటివ్‌ వార్తలతో క్రాష్‌ అయిన కంపెనీల జోలికి పోకపోవడం మంచిదని ఐఐఎఫ్‌ఎల్‌ సూచిస్తోంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీల్లో భారీగా పతనమైన కంపెనీల షేర్లను వదిలి బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ షేర్లను ఎంచుకోవాలని సూచించింది. ఈ నాలుగూ బాగా స్థిరమైన ప్రదర్శన చూపే సత్తా

Most from this category