News


10,600 దిగువన నిఫ్టీ

Wednesday 14th November 2018
Markets_main1542172617.png-21970

లాభాలతో ప్రారంభమైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు గంట తర్వాత యూటర్న్‌ తీసుకున్నాయి. రూపాయ రికవరీ కారణంగా ఐటీ ఇండెక్స్‌ బాగా పడిపోవడంతో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు నష్టా‍ల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:23 సమయంలో సెన్సెక్స్‌ 83 పాయింట్ల నష్టంతో 35,061 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 10,564 వద్ద ట్రేడవుతున్నాయి. 

నిఫ్టీ-50లో హిందుస్తాన్‌ పెట్రోలియం 9 శాతానికి పైగా ఎగసింది. బీపీసీఎల్‌, ఐఓసీ షేరు​7 శాతానికి పైగా పెరిగాయి. ఏసియన్‌ పెయింట్స్‌ 3 శాతానికి పైగా, టాటా స్టీల్‌ 2 శాతానికి పైగా, హెచ్‌యూఎల్‌ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇక సన్‌ ఫార్మా 5 శాతం మేర పడిపోయింది. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా 3 శాతానికిపైగా నష్టపోయింది. టీసీఎస్‌ 3 శాతం మేర తగ్గింది. గెయిల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, విప్రో షేర్లు 2 శాతానికి పైగా తగ్గాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. రూపాయి బలపడటం వల్ల ఐటీ, ఫార్మా ఇండెక్స్‌లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. నిఫ్టీ ఐటీ ఏకంగా 3 శాతంమేర పతనమైంది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పడిపోయాయి. 

కాగా స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,582 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో 10,634 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,144 పాయింట్లతో పోలిస్తే 186 పాయింట్ల లాభంతో 35,330 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.



You may be interested

87 శాతం తగ్గిన గతి లాభం

Wednesday 14th November 2018

సెప్టెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో గతి లిమిటెడ్‌ నిరాశపరిచింది. నికరలాభం ‍క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87.5 శాతం తగ్గి రూ.2.6 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.434 కోట్ల నుంచి రూ.468 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.929 కోట్ల టర్నోవరుపై రూ.8.2 కోట్ల నికరలాభం సాధించింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 4.23 శాతం అధికమై రూ.86.25 వద్ద స్థిరపడింది.

స్థిరంగా పసిడి ధర

Wednesday 14th November 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.20డాలర్లు స్వల్పంగా పెరిగి 1203 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపు ప్రభావంతో నేడు ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు పసిడి ధరపై

Most from this category