News


నేలక్కొట్టిన బంతి.. నేటి మార్కెట్‌

Tuesday 3rd March 2020
Markets_main1583230936.png-32249

సెన్సెక్స్‌ 480 పాయింట్ల హైజంప్‌
170 పాయింట్లు ఎగసిన నిఫ్టీ
అన్ని రంగాలూ లాభాల్లోనే 
మెటల్‌, ఫార్మా రంగాల దూకుడు

రెండు రోజుల వరుస పతనానికి చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌చేసి 38,624 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 170 పాయింట్లు జమ చేసుకుని 11,303 వద్ద నిలిచింది. సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 5 శాతం జంప్‌చేయడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,754 వద్ద గరిష్టాన్ని తాకగా.. 38,142 వద్ద కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ 11,342-11,152 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కరోనా వైరస్‌ కట్టడికి అమెరికా, చైనా, జపాన్‌సహా యూరోపియన్‌ దేశాల కేంద్ర బ్యాంకులు చర్యలు చేపట్టనున్న అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

2 షేర్లు మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ పుంజుకోగా.. మెటల్స్‌, ఫార్మా దాదాపు 6 శాతం ఎగశాయి. ఇతర రంగాలలో మీడియా, ఐటీ, ఆటో, రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ 3.5-1.25 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, సన్‌ ఫార్మా, హిందాల్కో, జీ, టాటా స్టీల్‌, సిప్లా, ఐషర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌, కోల్‌ ఇండియా 8.3-5 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఐటీసీ, యస్‌ బ్యాంక్‌ మాత్రమే 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. 

బయోకాన్‌ జోరు
డెరివేటివ్స్‌లో బయెకాన్‌, ఎన్‌సీసీ, పిరమల్‌, మదర్‌సన్‌, సెంచురీ టెక్స్‌ 8-6 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. మరోపక్క బెర్జర్‌ పెయింట్స్‌, సీఈఎస్‌సీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, భారత్‌ ఫోర్జ్‌, మైండ్‌ట్రీ, కంకార్‌, ఈక్విటాస్‌, ఇండిగో, బాటా 2.2-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2-1.5 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1248 లాభపడగా.. 1156 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1355 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1139 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక వారాంతాన ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1429 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 7621 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. You may be interested

నిఫ్టీ నష్టాలు ఆగితే... ఈ 17షేర్లలో ర్యాలీ..!

Tuesday 3rd March 2020

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 17 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో ఫైజర్‌, కాల్గేట్‌, ఇప్కా ల్యాబ్స్‌, అరవింద్‌ ల్యాబ్స్‌, సెలబ్రటీ ఫ్యాషన్‌ లిమిటెడ్‌, కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌,  నవభారత్‌ వెంచర్‌, ముకుంద్‌ లిమిటెడ్‌, ఏషియన్‌ హోటల్స్‌(ఈస్ట్‌), జేఆర్‌డీఎంకేజేఎల్‌, మరెల్‌ ఓవర్సీస్‌,

ఈటీఎఫ్‌ నిధులు వెనక్కి మళ్లితే.. పతనమే!

Tuesday 3rd March 2020

కరోనా వైరస్‌తో సరఫరాలకు అంతరాయం వినియోగదారునిపై ప్రభావమే ఎక్కువ ఎఫెక్ట్‌  చైనా 15 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రామ్‌దేవ్‌ అగర్వాల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌  ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ చేయగల చేటును ప్రపంచం తక్కువగా అంచనా వేస్తోంంటున్నారు రామ్‌దేవ్‌ అగర్వాల్‌. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లు, ఈటీఎఫ్‌ పెట్టుబడులు తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..  ఇటీవల వెలువడిన చైనా గణాంకాలను ప్రపంచం

Most from this category