News


మూడో రోజూ మార్కెట్‌ స్పీడ్‌

Wednesday 5th February 2020
Markets_main1580898552.png-31536

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ
41,000 పాయింట్ల ఎగువకు
నిఫ్టీ సైతం లాభాల సెంచరీ
ఎన్‌ఎస్‌ఈలో మీడియా వెనకడుగు 

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సాధించింది. 353 పాయింట్లు జమ చేసుకుని 41,143 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు ఎగసి 12,089 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సె‍క్స్‌ తిరిగి 41,000 పాయింట్ల మార్క్‌ను దాటేయగా.. నిఫ్టీ 12,000 స్థాయికి ఎగువన నిలిచింది. అయితే తొలుత ఒక దశలో అమ్మకాలదే పైచేయి కావడంతో సెన్సెక్స్‌ 40,703 పాయింట్ల వద్ద  ఇంట్రాడే కనిష్టానికి చేరింది. తదుపరి జోరందుకుని 41,177 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ 12,098-11,953 పాయింట్ల మధ్య ఒడిదొడుకులను చవిచూసింది. మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను అందుకోవడం, ఆసియాలో జపాన్‌, చైనా మార్కెట్లు ఊపందుకోవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

మెటల్‌, రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో మీడియా మాత్రమే(0.8 శాతం) బలహీనపడగా.. మెటల్‌ 3 శాతం, రియల్టీ 2 శాతం, బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, వేదాంతా, హిందాల్కో, ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 11-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే జీ, హీరో మోటో, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ 6.4-0.5 శాతం మధ్య పతనమయ్యాయి.

శ్రీరామ్‌ ట్రాన్స్‌ జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఆర్‌ఈసీ, ఉజ్జీవన్‌, పీఎఫ్‌సీ, సెయిల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 7.7-5.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బాలకృష్ణ, మణప్పురం, బాష్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ 2.2-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.4-0.75 శాతం మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1327 లాభపడగా.. 1109 నష్టాలతో ముగిశాయి.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 366 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 602 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1200 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు దాదాపు రూ. 1287 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి.You may be interested

7.50శాతం లాభంతో ముగిసిన యస్‌ బ్యాంక్‌ షేరు

Wednesday 5th February 2020

మూలధనాన్ని పెంచుకునేందుకు రుణాలిచ్చేందుకు రుణదాతలు ముందుకొచ్చారనే వార్తల నేపథ్యంలో బుధవారం యస్‌ బ్యాంక్‌ షేరు 7.50శాతం లాభంతో రూ.37.60 వద్ద ముగిసింది. నేడు ఈ బ్యాంక్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.35.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. యస్‌ బ్యాంక్‌లో  2బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ ఎల్‌పి, ఐడిఎఫ్‌సి సెక్యూరిటీస్ లిమిటెడ్, అంబిత్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ముందుకొచ్చినట్లు ఈ వ్యహారంతో సంబందం ఉన్న ముగ్గురు వ్యక్తులు పేర్కోనారు. అయితే ఈ

ఫ్యూచరో-ఈను ఆవిష్కరించిన మారుతీ సుజుకీ

Wednesday 5th February 2020

బుధవారం మారుతీ సుజుకీ ఆటో ఎక్స్‌పో-2020లో కూపే స్టైల్‌ ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్‌ కారు ‘‘ఫ్యూచరో-ఈ’’ను  ఆవిష్కరించింది. మిషన్‌ గ్రీన్‌ మిలియన్‌లో భాగంగా ఈకారును విడుదల చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్యావరణాన్ని దృష్టిలోపెట్టుకుని వచ్చే ఐదేళ్లలో 10 లక్షల గ్రీన్‌ కార్ల(సీఎన్‌జీ, హైబ్రిడ్స్‌, ఎలక్ట్రిక్‌)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ కెనిచీ అయుక్వా వెల్లడించారు.  ఫ్యూచరో- ఈలో క్రాస్‌బార్‌ డిజైన్‌ ఉంది. కారు

Most from this category