News


పన్ను పెరుగుదల మాత్రమే కాదు..!

Tuesday 9th July 2019
Markets_main1562666004.png-26927

పతనానికి ఇంకా చాలా కారణాలున్నాయి
అడ్రైన్‌ మోవత్‌
బడ్జెట్‌ అనంతరం మూడో రోజు కూడా మార్కెట్‌ నెగిటివ్‌ మూడ్‌లోనే కొనసాగుతోంది. చాలా మంది అనలిస్టులు ఈ పతనానికి కారణం అధికాదాయ వర్గాలపై పన్ను పెంచడమేనని అభిప్రాయపడుతున్నారు. హెచ్‌ఎన్‌ఐలపై పన్ను పెంచడం ఎఫ్‌పీఐలపై నెగిటివ్‌ ప్రభావం పడుతుందని విశ్లేషిస్తున్నారు. కానీ వర్దమాన మార్కెట్ల నిపుణుడు అడ్రైన్‌ మోవత్‌ మాత్రం పతనానికి ఇంకా చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. కేవలం పన్ను పెంచారని మాత్రమే మార్కెట్లో అమ్మకాల వెల్లువ రాలేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ కారణాలు ముఖ్యంగా ఫెడ్‌ రేట్లతగ్గింపు ఆశలు సన్నగిల్లడం మార్కెట్‌పై ప్రభావం చూపిందన్నారు. "ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉంటుందనే అంచనాలు భారీగా పెట్టుకున్నాం. కానీ అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు పెరిగిందని డేటా విడుదలయ్యింది. ఇది గత 5 నెలల కంటే అధికంగా ఉండడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టపోయాయి. " అని తెలిపారు. ఇటీవల యూఎస్‌ జాబ్‌ మార్కెట్‌ బలమైన గణాంకాలు నమోదు చేసింది. దీంతో రేట్‌కట్‌ ఆశలు సన్నగిల్లాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై నెగిటివ్‌గా పడిందని మోవత్‌ చెప్పారు. మార్కెట్‌ పతనానికి మరో కారణం బడ్జెట్లో ప్రోత్సాహకర పాజిటివ్‌ ప్రకటనలు లేకపోవడమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీల్లో సైతం ఇటీవల మంచి పెరుగుదల నమోదయిందని, అందువల్ల ఒక పతనం బాకీ ఉందని, ఈ కారణంగానే తాజా క్షీణత సంభవిస్తోందని అభిప్రాయపడ్డారు.

బడ్జెట్లో ప్రమోటర్ల వాటా తగ్గింపు అంశం, పన్ను అంశాల్లాంటివి బడా ఇన్వెస్టర్లను భారత్‌లో పెట్టుబడులపై పునరాలోచించుకునేలా చేశాయన్నారు. కానీ ఇవేమీ దీర్ఘకాలం ప్రభావం చూపగల అంశాలు కావని, విత్త పరిస్థితుల దృష్ట్యా వీటిని స్వాగతించవచ్చని చెప్పారు. బడ్జెట్లో వినిమయం పెంచేందుకు ఎలాంటి స్వల్పకాలిక చర్యలు ప్రకటించలేదన్నారు. బడ్జెట్లో ప్రకటించిన కొన్ని చర్యలు అంతర్జాతీయ కంపెనీలు భారత పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉన్నాయని, కానీ ఇవి దీర్ఘకాలంలో మాత్రమే వినిమయం పెరిగేందుకు దోహదం చేస్తాయని వివరించారు. 
 You may be interested

యస్‌బ్యాంక్‌ షేరు ర్యాలీకి రెడీగా ఉందా?

Tuesday 9th July 2019

మార్కెట్లో మూడు రోజులుగా జరుగుతున్న పతనంతో సంబంధం లేకుండా యస్‌ బ్యాంకు షేరు మాత్రం పాజిటివ్‌గా కదలాడుతోంది. మంగళవారం ఆరంభట్రేడింగ్‌లో దాదాపు 4 శాతం లాభపడిన యస్‌బ్యాంకు షేరు చివర్లో స్వల్ప నష్టంతో క్లోజయింది. తమ ఆర్థిక పరిస్థితి బలంగా, స్థిరంగా ఉందని సోమవారం బ్యాంకు ప్రకటించింది. లిక్విడిటీ, నిర్వహణా సామర్ధ్యం జోరు చూపుతూనే ఉన్నాయని తెలిపింది. దీంతో సోమవారం షేరు మంచి ర్యాలీ జరిపింది. గత కొన్ని నెలలుగా

మరో 200 పాయింట్ల పతనం పక్కా?!

Tuesday 9th July 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ అనంతరం కరెక‌్షన్‌ మూడ్‌లోకి మారాయి. సోమవారం సూచీలు భారీ పతనం నమోదు చేశాయి. మంగళవారం ట్రేడింగ్‌లో నెగిటివ్‌ ధోరణితో ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు ఇప్పట్లో స్థిరపడవని, మరింత పతనం ముందుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాల్యూషన్లపరంగా సూచీల్లో మరికొంత కరెక‌్షన్‌ బాకీ ఉందంటున్నారు. కంపెనీల నిజపరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, బడ్జెట్లో ఇండస్ట్రీకి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం మార్కెట్‌ను నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇవన్నీ ఎర్నింగ్స్‌పై

Most from this category