News


సందిగ్థ దశలో మార్కెట్‌!

Saturday 23rd November 2019
Markets_main1574488667.png-29809

స్వల్పకాలానికి కన్సాలిడేషన్‌
లాంగ్‌టర్మ్‌ పాజిటివ్‌
జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ అనలిస్టు వినోద్‌ నాయర్‌
దేశీయ మార్కెట్లు సందిగ్దంలో ఉన్నాయని, అందువల్ల సరైన దిశానిర్ధేశం లేకుండా కదులుతున్నాయని జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. బలహీన గణాంకాలు, అధిక వాల్యూషన్ల నేపథ్యంలో సూచీలు కొంతకాలం కన్సాలిడేషన్‌ దశలోనే ఉంటాయన్నారు. సంవత్సరానికి నిఫ్టీ టార్గెట్‌ 12600 పాయింట్లుగా నిర్ణయించుకున్నామన్నారు. నిఫ్టీ ప్రస్తుతం ఏడాది ఫార్వర్డ్‌ పీఈ 26 రెట్ల వద్ద వద్ద ట్రేడవుతోందని చెప్పారు. అందువల్ల స్వల్పకాలానికి ముందుకు దూసుకుపోయే అవకాశాలు స్వల్పమని చెప్పారు. అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు నెగిటివ్‌గా మారుతున్నాయని, ట్రేడ్‌డీల్‌పై తాజా ఆందోళనలు, హెచ్‌1బీ వీసా నిబంధనలు, బ్రెగ్జిట్‌ సందిగ్ధత తదితరాలు నెగిటివ్‌ ప్రభావం చూపుతాయని చెప్పారు. అందువల్ల దేశీయ బ్లూచిప్స్‌ ముందుకు కదిలేందుకు ఇబ్బందిపడుతున్నాయని వినోద్‌ తెలిపారు. అయితే దీర్ఘకాలానికి మార్కెట్‌ పాజిటివ్‌గానే ఉంటుందన్నారు. పీఎస్‌యూ, ఏఎంసీ, బీమా, గ్రీన్‌ ఎనర్జీ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. మెటల్స్‌ రంగంపై నెగిటివ్‌గా ఉన్నామని చెప్పారు. ఈ రంగంలోని చాలా స్టాకులకు హోల్డ్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నామని, సైక్లిక్స్‌ మారితే ఇవి మరలా పుంజుకుంటాయని తెలిపారు. 
చిన్న స్టాకులే బెటర్‌...
పెద్ద స్టాకులతో పోలిస్తే చిన్న స్టాకుల వాల్యూషన్లు తక్కువగా ఉన్నాయని, వీటి ముందస్తు పీఈ 15 రెట్లుగా ఉందని తెలిపారు. క్యు2 ఫలితాల్లో సైతం పెద్ద స్టాకుల కంపెనీల కన్నా చిన్న స్టాకుల కంపెనీలు మంచి ఫలితాలు నమోదు చేశాయని చెప్పారు. కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు, ముడి పదార్ధాల ధరలు దిగిరావడం చిన్న కంపెనీలకు కలిసివచ్చిందన్నారు. క్యు2 అనంతరం కొన్ని మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ రీరేటింగ్‌ పొందాయన్నారు. నెలాఖరుకు విడుదలయ్యే జీడీపీ గణాంకాలు, ఆర్‌బీఐ ధృక్పధం, ట్రేడ్‌డీల్‌ ఫలితం.. స్వల్పకాలానికి మార్కెట్‌ స్థితిని నిర్ధారిస్తాయని చెప్పారు. దీర్ఘకాలానికి పెద్ద షేర్ల కన్నా చిన్న షేర్లు అధిక రాబడినివ్వడం కొనసాగుతుందని అంచనా వేశారు. ఎస్సార్‌స్టీల్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రుణదాతలకు చాలా మేలు చేసేదని అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో భవిష్యత్‌లో మొండిపద్దుల వసూళ్లు వేగవంతం కావచ్చని, వ్యాపార నైతికత పెరుగుతుందని వినోద్‌ అంచనా వేశారు. 



You may be interested

స్టాక్‌ విలువపై దృష్ఠిపెట్టండి..ఆర్థిక అంచనాలపై కాదు!

Saturday 23rd November 2019

-ప్రశాంత్‌ జైన్‌ జీడీపీ వృద్ధిరేటు తాత్కాలికంగా పడిపోయినంత మాత్రాన స్టాక్‌ మార్కెట్లను ప్రతికూల దృక్పథంతో చూడకూడదని దేశీయ స్టార్‌ ఫండ్‌ మేనేజర్‌, ఈ ఏడాదితో ఒకే ఫండ్‌ను 25 ఏళ్లు నిర్వహించిన ఘనతను సాధించిన ప్రశాంత్‌ జైన్‌ అన్నారు.   ‘జీడీపీ వృద్ధి రేటు  8 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. కానీ ఇది ఎల్లప్పుడు అక్కడే ఉండదు’ అని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఈడీ, సీఐఓగా విధులు నిర్వర్తిస్తున్న

మొబైల్ కొనుగోళ్లు 88 శాతం

Saturday 23rd November 2019

ముంబై: మొబైల్ ఫోన్‌ వాడకందారుల్లో 88 శాతం మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, చెల్లింపులను చేస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ‘ఎంకామర్స్‌ రిపోర్ట్‌’ పేరిట పేపాల్‌, ఐపీఎస్‌ఓఎస్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ సగటు 77 శాతంగా ఉంటే, ఇంతకుమించి భారతీయులు మొబైల్ ఫోన్లను చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారని తేలింది. ఇందులోనూ, ఏకంగా 98 శాతం మంది యాప్‌ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఇక వచ్చే 12

Most from this category