News


చిన్న స్టాకులు ఆకర్షణీయం!

Thursday 5th September 2019
Markets_main1567665771.png-28213

కోటక్‌ మహీంద్రా ఏఎంసీ డైరెక్టర్‌ నీలేశ్‌ షా
వాల్యూషన్ల పరంగా మార్కెట్లు చౌకగా ఉన్నాయని, ముఖ్యంగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ డైరెక్టర్‌ నీలేశ్‌ షా చెప్పారు. లార్జ్‌క్యాప్స్‌ సైతం సరసమైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయని, సూపర్‌ లార్జ్‌క్యాప్స్‌ మాత్రం ఇంకా ఖరీదుగానే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లు నెగిటివ్‌ నుంచి న్యూట్రల్‌ ధృక్పథంలో కదలాడుతున్నాయని తెలిపారు. ఎర్నింగ్స్‌ అంచనాలను అందుకోలేకపోవడం, వివిధ టాక్సులు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త రిస్కు తీసుకోవడానికి రెడీగా ఉన్న ఇన్వెస్టర్లు వైవిధ్యభరితమైన పోర్టుఫోలియోను వివిధ స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌తో ఏర్పరుచుకోవచ్చని సూచించారు. మంచి మేనేజ్‌మెంట్‌ ఉన్న కంపెనీలను ఎంచుకోవడం కీలకమన్నారు. అదేవిధంగా ఒక మోస్తరు రుణభారం ఉన్న కంపెనీలను, నిర్వహణ సామర్ధ్యం పెంచుకుంటున్న కంపెనీలను ఎంచుకోవాలని చెప్పారు. నిర్వహణ సామర్ధ్యం పెంచుకునే కంపెనీలు ఎకనమిక్‌ సైకిల్‌ ఊపందుకున్నప్పుడు ఎక్కువవగా లాభం పొందుతాయని తెలిపారు. ఇన్వెస్టర్లు భారీగా ఒకేమారు పెట్టుబడులు పెట్టవద్దని, 6- 18 నెలల కాలపరిమితి పెట్టుకొని ఎస్‌టీపీ(క్రమబద్ధ బదిలీ ప్రణాళిక) మార్గంలో పెట్టుబడులు పెట్టాలని సలహా ఇచ్చారు. 
మూడు అంశాలు నడిపిస్తాయి..
మార్కెట్లు నిధులు, మౌలిక విషయాలు, సెంటిమెంట్స్‌ అనే అంశాలపై కదలాడుతుంటోందని నిలేశ్‌ తెలిపారు. నిధుల పరంగా ప్రస్తుతం ఇండియా న్యూట్రల్‌గా ఉందని తెలిపారు. ఎఫ్‌పీఐలు, హెచ్‌ఎన్‌ఐలు, రిటైలర్లు అమ్మేస్తుండగా, డీఐఐలు కొంటున్నారని తెలిపారు. సెంటిమెంట్‌ పరంగా న్యూట్రల్‌ నుంచి నెగిటివ్‌గా ఉన్నామన్నారు. ఇందుకు పన్నులు, ఎర్నింగ్స్‌ గ్రోత్‌ బాగాలేకపోవడం కారణాలని వివరించారు. ఫండమెంటల్స్‌ పరంగా చూస్తే తాజాగా విడుదలైన జీడీపీ గణాంకాలు నిరాశపరిచాయని తెలిపారు. ఈ ప్రతికూలతల కారణంగా మార్కెట్లు రెండు పాజిటివ్‌ విషయాలను గుర్తించడం లేదన్నారు. చమురు ధరలు దిగిరావడం, రుతుపవనాలు క్రమంగా విస్తరించడమనే విషయాలను పట్టించుకోలేదన్నారు. ఈ స్థితిలో ఫండమెంటల్స్‌ మెరుగైతే తప్ప సెంటిమెంట్‌లో కానీ ఫండ్స్‌ రావడంలో కాని అప్‌టర్న్‌ కనిపించదని హెచ్చరించారు. అంతర్జాతీయంగా ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు ఉన్నా, నిజానికి అది మనకు కలిసివచ్చే అంశమని తెలిపారు. చైనాను వీడే కంపెనీలను మనం ఆకట్టుకోగలిగితే వృద్ధి విషయంలో చైనాతో వచ్చిన వ్యత్యాసాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ఫండమెంటల్స్‌ మెరుగుపడాలంటే డెట్‌, ఈక్విటీ క్యాపిటల్‌ ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని, ఇందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి సులువుగా రుణపంపిణీ జరిగేలా చూడాలని తెలిపారు. వీటితో పాటు సంస్థాగత సంస్కరణలు తీసుకురావడం, వడ్డీరేట్ల తగ్గింపు, వ్యాపారానుకూల వాతవరణం మెరుగుపరచడం వంటివి చేయడం ద్వారా మౌలికాంశాలను మెరుగుపరచవచ్చని అభిప్రాయపడ్డారు. You may be interested

గరిష్టం నుంచి 1శాతం క్షీణించిన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 5th September 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులను లోనైంది. నేడు 27,086.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ 120 పాయింట్ల పెరిగి 27243.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ గరిష్టస్థాయి(27243.95) నుంచి 285 పాయింట్లు(1శాతం) నష్టపోయి 26,959.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యా్‌హ్నం

ఆల్‌టైం గరిష్ఠానికి ఇన్ఫోసిస్‌

Thursday 5th September 2019

యుఎస్‌-చైనా మధ్య మరో రౌండ్‌ వాణిజ్య చర్చలు అక్టోబర్‌ నెల ప్రారంభంలో ఉండడంతో గురువారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశియ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్‌ తన ఆల్‌ టైం గరిష్ఠాన్ని చేరుకుంది. ఉదయం 11.53 సమయానికి ఇన్ఫోసిస్‌ స్టాకు 1.53 శాతం లాభపడి రూ. 833.85  వద్ద ట్రేడవుతోంది. రూపీ డాలర్‌ మారకంలో భారీగా పడిపోవడంతో సెప్టెంబర్‌ 3 సెషన్‌లో తన 52 వారాల గరిష్ఠాన్ని

Most from this category