News


11500 పాయింట్లు దాటకపోతే 11100 వరకు నిఫ్టీ!

Thursday 25th July 2019
Markets_main1564036989.png-27305

నిఫ్టీ వరుస నష్టాలను నమోదు చేస్తూ క్రమంగా 11300 పాయింట్ల దిగువకు చేరింది. పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, ఫార్మా రంగాల్లో అమ్మకాలు సూచీలను కుంగదీసాయి. దీర్ఘకాలిక చార్టుల్లో నిఫ్టీ లోయర్‌ హై, లోయర్‌ లో క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11200 పాయింట్ల వద్ద నిలదొక్కుకునేందుకు కొంత అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థాయి వద్ద కీలక ఫిబోనాకి సపోర్ట్‌ స్థాయిలున్నాయి. దీనికితోడు మార్కెట్‌ బాగా ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లోకి జారినందున ఒక తక్షణ పుల్‌బ్యాక్‌కు ఛాన్సులున్నాయని అంచనా.

మార్కెట్‌ బలహీనంగా ఉన్నా, ఇండికేటర్లన్నీ ఓవర్‌సోల్డ్‌ను సూచిస్తున్నందున చిన్నదైనా సరే ఒక బౌన్స్‌ ఉండొచ్చు. ఈ బౌన్స్‌కు 11500 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుంది. ఈ స్థాయిని బలంగా దాటి 11600 పాయింట్ల పైన స్థిరంగా ముగిస్తే తాజా డౌన్‌ట్రెండ్‌ ముగింపునకు వస్తుంది. ఒకవేళ ఈ బౌన్స్‌లో 11500 పాయింట్లను దాటలేకున్నా, 11200 పాయింట్ల మద్దతు కోల్పోయినా 11000- 11100 పాయింట్ల వరకు దిగజారుతుందని నిపుణుల అంచనా. దిగువన ఈ స్థాయి ఎన్నికల ఫలితాలకు ముందు కనిష్ఠ స్థాయిగా ఉంది. అందువల్ల ఇక్కడ మద్దతుకు అవకాశాలు ఎక్కువ. ఈ స్థాయి నుంచి కోలుకునే ఛాన్సులుంటాయి.

నిఫ్టీ 11600 పాయింట్లను దాటితే కొత్తగా లాంగ్స్‌ను పరిశీలించవచ్చు. 



You may be interested

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

Thursday 25th July 2019

మందగమనంలో ఆటో రంగం కోలుకోవడానికి తోడ్పాటు అందించాలి కేంద్రానికి ఆటో పరికరాల తయారీ సంస్థల విన్నపం న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం మరింత కాలం కొనసాగితే 10 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు కోత పడే ముప్పు పొంచి ఉందని ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను పెంచే దిశగా జీఎస్‌టీ రేటు తగ్గింపు తదితర చర్యలతో ఆటోమొబైల్ రంగం కోలుకునేందుకు తోడ్పాటు అందించాలని కేంద్రానికి

ఎగవేతదారులతో కఠినంగా వ్యవహరించాలి

Thursday 25th July 2019

నిజాయితీగా పన్నులు కట్టేవారికి తగిన గౌరవమివ్వాలి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు  మంత్రి నిర్మలా సీతారామన్ సూచన న్యూఢిల్లీ: వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకుని పన్నులను ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే, నిజాయితీగా కట్టాలనుకునేవారికి అవసరమైన తోడ్పాటునిచ్చి, తగిన విధంగా గౌరవించాలని పేర్కొన్నారు.  159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు.

Most from this category