News


బేరిష్‌ దశలోకి మార్కెట్లు: ఉమేష్‌ మెహతా

Sunday 21st July 2019
Markets_main1563733007.png-27206

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎఫ్‌పీఐలకు పన్ను మినహాయింపు లేదంటూ చేసిన ప్రకటన, బలహీన రుతుపవనాలు మార్కెట్ల నష్టాలకు కారణమని, ఈ పరిణామాలతో మార్కెట్లు బేరిష్‌ దశలోకి అడుగుపెట్టినట్టు శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల్లో బలహీనత, క్షేత్రస్థాయిలో మందగమనం మార్కెట్లను కనిష్టాలకు తీసుకెళ్లాయన్నారు. ఇప్పటికీ స్టాక్స్‌ విలువలు గరిష్టాల్లోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

కంపెనీల ఫలితాల సీజన్‌ తారా స్థాయికి చేరిందని, ఈ వారంలో ఎఫ్‌అండ్‌వో గడువు తీరనున్న నేపథ్యంలో నిఫ్టీ 11,300 స్థాయిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని ఇన్వెస్టర్లకు  మెహతా సూచించారు. ఇది కీలక మద్దతు స్థాయి అని, ఒకవేళ ఇది కోల్పోతే మరింత నష్టాలకు కారణమవుతుందన్నారు. కంపెనీల ఫలితాలు సెంటిమెంట్‌ను మెరుగుపరచలేకపోయినట్టు చెప్పారు. ఫలితాల సీజన్‌ మార్కెట్లను మెప్పించలేకపోయిందని, ఎన్నో రంగాల్లో మందగమనం ఉన్నట్టు పేర్కొన్నారు. కేవలం కొన్ని రంగాలే... సిమెంట్‌, అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఇప్పటి వరకు మంచి ఫలితాలను ఇచ్చాయని, మిగిలిన రంగాల్లో బలహీనత ఉన్నట్టు మెహతా చెప్పారు. ఈ బలహీనత కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని, ఈ వారంలో ట్రేడర్లు మార్కెట్‌ ర్యాలీలy విక్రయించడమనే విధానాన్ని అనుసరించాలని సూచించారు. మిగిలిన ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియో విషయంలో కొంత నగదు నిల్వలు పెంచుకోవాలన్నారు. 

 

నిఫ్టీ మరోసారి ఇన్వెస్టర్లను నిరాశపరిచిందని, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం సెంటిమెంట్‌ను మెరుగుపరిచే విధంగా లేని విషయాన్ని మెహతా గుర్తు చేశారు. ఎన్నో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఏ స్టాక్‌లో అయినా వెంటనే పెట్టుబడులు పెట్టకుండా, కాస్త వేచి చూడడం మంచి విధానంగా సూచించారు. మార్కెట్లు ఇంకా దిద్దుబాటుకు అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ, నగదు నిల్వలు, రుణభారం, ప్రమోటర్ల వాటాల తనఖా, నిర్వహణ సామర్థ్యాలు, ఇతర ఫండమెంటల్స్‌ను పరిశీలించిన తర్వాతే ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని హెచ్చరించారు. You may be interested

ఫార్మాలో ఇండిట్రేడ్‌ సిఫారసులు ఇవి...

Sunday 21st July 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఎఫ్‌పీఐలకు ట్రస్ట్‌ల రూపంలో ఎటువంటి ఉపశమనం లేదంటూ ఇచ్చిన స్పష్టత మార్కెట్లకు తుఫానులా పరిణమించిందన్నారు ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌కు చెందిన సుదీప్‌ బంధోపాధ్యాయ. ఎఫ్‌పీఐలకు ఇది ఆందోళన కలిగించేదని, దీనికి కారణం 40 శాతం ఎఫ్‌పీఐలు ట్రస్ట్‌ మార్గంలోనే మన ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్ల పతనానికి కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు మెరుగ్గా లేకపోవడం కూడా కారణంగా పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ల వ్యాఖ్యలు

మార్కెట్లు ఇంకా నష్టపోవొచ్చు: కునాల్ బోత్రా

Saturday 20th July 2019

మార్కెట్లో జోరుగా సంస్థాగత విక్రయాలు జరుగుతున్నట్లు అమ్మకాల సరళిని చూస్తే అర్థమవుతోందని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో మార్కెట్ విశ్లేషకుడు కునాల్ బోత్రా చెప్పారు. ఇంటర్యూలోని ముఖ్యమైన విషయాలు ఆయన మాటల్లోనే.... అంతర్జాతీయ భాగస్వామ్యం మన మార్కెట్లకు ముఖ్యమని గత కొన్ని సెషన్‌లను గమనిస్తే అర్దమవుతుంది. విదేశి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపితే దేశియ ఇన్వెస్టర్లు కూడా వారితో జత కట్టారు. ఇలా అయితే మార్కెట్లలో సమతూకం ఎలా వస్తుంది? దీంతోపాటు మార్కెట్లను

Most from this category