STOCKS

News


కనిష్ట స్థాయికి స్టాక్స్‌...! జున్‌జున్‌వాలా

Thursday 12th September 2019
Markets_main1568311224.png-28338

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ప్రస్తుతానికి కనిష్ట స్థాయి పూర్తయిందని (బోటమ్డ్‌ అవుట్‌) ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది రుతుపవానాలు బాగున్నాయి. బ్యాంకుల్లోకి నిధుల వెల్లువ ఉంది. బ్యాంకుల క్రెడిట్‌ 15 శాతం పెరగనుంది. ఎన్‌పీఏల నుంచి బయట పడుతున్నాం’’ అని రాకేశ్‌ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు.

 

కేంద్ర ప్రభుత్వ పాలసీలకు జున్‌జున్‌వాలా మద్దతుగా నిలిచారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మంచి పనితీరు చూపించిందన్నారు. దేశం నిర్దేశిత సమయానికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న దానికి నేను మద్దతిస్తాను. తన నియోజకవర్గానికి చేసిన హామీలను ఆయన నెరవేర్చారు’’ అని పేర్కొన్నారు. స్టాక్స్‌ కనిష్ట స్థాయిలను నమోదు చేశాయని, ముఖ్యంగా మిడ్‌క్యాప్స్‌లో ఇది జరిగిందన్నారు. దీంతో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇది మంచి అనుకూల సమయంగా జున్‌జున్‌వాలా అభిప్రాయపడ్డారు. సంకేతాలు టర్న్‌అరౌండ్‌ అయినట్టు చూపిస్తున్నాయన్నారు. టర్న్‌అరౌండ్‌ మొదలైందని తెలుస్తోందని, కానీ ఇది నిదానంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. 

 

ఆర్థిక రంగ పునరుత్తేజానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన సంస్కరణలపై జున్‌జున్‌వాలా స్పందిస్తూ.. దీర్ఘకాలం కోసం ఆలోచించాలని, స్వల్ప కాల ఉద్దీపనలు ఆర్థిక రంగానికి పెద్దగా సాయపడవన్నారు. దీర్ఘకాల వృద్ధి కోసం... ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్‌ కంపెనీలను రద్దు చేయాలని సూచించారు. అలాగే, రైతుల రుణాలకు హామీనివ్వాలని, వ్యాపార సులభతరంపై పనిచేయాలని, మౌలిక సదుపాయాలపై వేగంగా ఖర్చు చేయాలని, డిస్కంల బకాయిలను చెల్లించాలని సూచించారు. మౌలిక రంగంలో భారీ ఎత్తున ఖర్చు చేయడమనే రూపంలో భారీ ఉద్దీపనల కోసం ఆర్థికవేత్తలు డిమాండ్‌ చేస్తుండగా, భారత్‌కు ఇది అసహజమేనన్నారు. ‘‘నూతన ప్రాజెక్టులకు అనుమతులకు సమయం పడుతుంది. ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అమలుకు ఎంతో సమయం తీసకుంటుంది’’ అని జున్‌జున్‌వాలా చెప్పారు. మరింత విప్లవాత్మక సంస్కరణగా ప్రభుత్వరంగ కంపెనీలను ప్రభుత్వం రద్దు చేసేయాలని సూచించారు. You may be interested

ఏ స్టాక్స్‌ను కొనాలో తెలియడం లేదా..?

Thursday 12th September 2019

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఆగస్ట్‌లో పెట్టుబడుల రాక పెరిగింది. వరుసగా ఇది నాలుగో నెల వృద్ధి. ఒకవైపు స్టాక్‌ మార్కెట్‌ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం చలించలేదు. అయితే, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు ప్రస్తుత మార్కెట్‌ స్పందనతో వేటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్న దానిపై సంశయంతో ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించదు. ఇటువంటి వారు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఆగస్ట్‌ నెలలో ఏ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాయి? ఏ

ఐదురోజుల లాభాలకు బ్రేక్‌

Thursday 12th September 2019

11000 దిగువున ముగిసిన నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన అమ్మకాలతో మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 11000 దిగువున 54.65 పాయింట్లు నష్టంతో 10,981.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 166 పాయింట్లు పతనమై 37,104.28 వద్ద ముగిసింది. నేడు మార్కెట్‌ ముగింపు అనంతరం అనంతరం వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలకు మొగ్గుచూపారు.  ఐదురోజుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు

Most from this category