News


లాభాల ప్రారంభం

Thursday 4th July 2019
Markets_main1562211578.png-26775

 ఆసియా మార్కెట్లు క్షీణతతో ట్రేడవుతున్నా, రేపు కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న నేపథ్యంలో గురువారం భారత్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా ఆరంభంకావడం వరుసగా ఇది నాలుగో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 88 పాయింట్ల పెరుగుదలతో 39,917 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,928 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. టాటా స్టీల్‌, సిప్లా, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌లు స్వల్పలాభాలతో మొదలుకాగా, టైటాన్‌ ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కోలు స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి.

అమెరికా రికార్డు ముగింపు...

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వచ్చే విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు బలపడటంతో గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు రికార్డుస్థాయిలో ముగిసాయి. ఎస్‌ అండ్‌ పీ-500 సూచి 3,000 పాయింట్ల శిఖరానికి చేరువలో స్థిరపడగా, డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ 27,000 పాయింట్ల సమీపంలోనూ, టెక్నాలజీ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ 7,900 పాయింట్ల సమీపంలోనూ ముగియడం విశేషం. ఈ మూడు సూచీలకు ఈ ముగింపు చరిత్రాత్మక గరిష్టస్థాయే. ఇక ఆసియా మార్కెట్లు తాజాగా స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. 



You may be interested

మరింత పెరిగిన రూపాయి

Thursday 4th July 2019

డాలర్‌ మారకంలో రూపీ గురువారం(జులై 4) ట్రేడింగ్‌లో 9 పైసలు బలపడి 68.82 వద్ద ప్రారంభమైంది. ఈ వారం బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో దేశియ మార్కెట్లు సానుకూలంగా ముగియడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో స్వల్పంగా బలపడి 68.91 వద్ద ముగిసింది. జులై 5 న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడంతో రూపీ స్వల్పంగా బలపడవచ్చని, ప్రభుత్వం బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచుతుందా?లేదా? అనే అంశంపై మదుపర్లు దృష్ఠి పెట్టనున్నారని మోతిలాల్‌

ఈ కంపెనీలను నమ్ముకుంటే.. లాభాలు గ్యారంటీ?

Wednesday 3rd July 2019

ప్రధాన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల సమీపానికి మరోసారి చేరువ అవుతున్నాయి. ఎంపిక చేసిన బ్లూచిప్‌ కౌంటర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు తీయిస్తున్నాయి. నిఫ్టీ ప్యాక్‌లో కేవలం 20 స్టాక్స్‌ 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు 10 శాతం రాబడులను ఇచ్చాయి. కానీ, అదే సమయంలో నిఫ్టీలోని మరో 24 కంపెనీలు మాత్రం ఇప్పటి వరకు 67 శాతం పడిపోయాయి. కాగా, ఈ విధమైన పోలరైజేషన్‌

Most from this category