News


పతనం- రికవరీ.. రెండూ రికార్డులే

Friday 13th March 2020
Markets_main1584095934.png-32467

తొలుత 3091 పాయింట్లు పడిన సెన్సెక్స్‌
29,389 వద్ద ఇంట్రాడే కనిష్టం నమోదు
తదుపరి 34,769ను దాటేసిన సెన్సెక్స్‌
కనిష్టం నుంచి 5380 పాయింట్ల హైజంప్‌
చివరికి 1325 పాయింట్లు ప్లస్‌లో ముగింపు
ఇవన్నీ సరికొత్త రికార్డులే కావడం విశేషం

వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు చరిత్రలోనే సరికొత్త ఫీట్‌ను సాధించాయి. తొలుత మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంగా సెన్సెక్స్‌ 3091 పాయింట్లు పడిపోయింది. ఇది 10 శాతం పతనంకావడంతో 45 నిముషాలపాటు ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ నిలిచిపోయింది. ఆపై తిరిగి ఉదయం 10.20కల్లా ట్రేడింగ్‌ ప్రారంభంకాగానే మార్కెట్లు వేగంగా కోలుకుంటూ వచ్చాయి. కొన్ని నిముషాలలోనే సెన్సెక్స్‌ లాభాలలోకి ప్రవేశించింది. 3091 పాయింట్ల రికవరీతోపాటు 550 పాయింట్లవరకూ ఎగసింది. అర్ధగంట వ్యవధిలో తిరిగి మరో 500 పాయింట్లు పతనమైంది. ఇలా తీవ్ర ఆటుపోట్ల మధ్య మిడ్‌సెషన్‌ నుంచీ స్పీడందుకుంది. ఆపై లాభాల దౌడు తీస్తూ చివరికి 1325 పాయింట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వెరసి 34,103 వద్ద నిలిచింది. ఈ ప్రయాణంలో సెన్సెక్స్‌ 2008 తదుపరి 10 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. దీంతో 29,389 పాయింట్లకు పడిపోయింది. తదుపరి జోరందుకుని ఏకంగా 34,769ను అధిగమించింది. అంటే ఒకే రోజులో 5,380 పాయింట్ల రికవరీ!! ఇవన్నీ సరికొత్త రికార్డులు కావడం నేటి ట్రేడింగ్‌లో విశేషాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

నిఫ్టీ తీరిలా
సెన్సెక్స్‌ బాటలో నిఫ్టీ సైతం తీవ్ర ఒడిదొడుకులను చవిచూసింది. తొలుత 10 శాతం కుప్పకూలింది. 8,555 పాయింట్లను తాకింది. ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభమయ్యాక దూకుడు చూపుతూ 10,159కు చేరింది. అంటే కనిష్టం నుంచీ ఏకంగా 1604 పాయింట్ల రికవరీని సాధించింది. ఈ ప్రయాణంలో చివరికి నిఫ్టీ 365 పాయింట్లు పెరిగి 9,955 వద్ద స్థిరపడింది. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీ 25671- 21,352 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. తొలుత సెన్సెక్స్‌, నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ మూడేళ్ల కనిష్టాలకు చేరాయి. ఇవి 2017 ఫిబ్రవరి కనిష్టాలుకాగా.. సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యూపీఏ తగిన మెజారిటీ సాధించడంతో 2009లో దేశీ స్టాక్‌ మార్కెట్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఫలితంగా రోజంతా ట్రేడింగ్‌ నిలిచిపోవడం విశేషం! 

మీడియా మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో మీడియా మాత్రమే(0.6 శాతం) నష్టపోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 12 శాతం దూసుకెళ్లాయి. ఈ బాటలో మెటల్‌, ఫార్మా, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో రంగాలు 6-4 శాతం మధ్య జంప్‌చేశాయింటే మార్కెట్లు ఏ స్థాయిలో బౌన్స్‌బ్యాక్‌ సాధించాయో అర్ధం చేసుకోవచ్చు. కాగా.. ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌, అందుబాటులోకి వచ్చిన కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు, ఫండ్స్‌ కొనుగోళ్లు మార్కెట్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ దిగ్గజాలలో ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, గ్రాసిమ్‌, హిందాల్కో, సిప్లా, ఓఎన్‌జీసీ, వేదాంతా 15-7 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో యూపీఎల్‌, జీ, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌ 7-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

ఐడియా జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, సెయిల్‌, బీవోబీ, నాల్కో, పీఎఫ్‌సీ, పీఎన్‌బీ, అరబిందో 36-11 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు అదానీ ఎంటర్‌, నౌకరీ, పిడిలైట్‌, కమిన్స్‌, యూబీఎల్‌, బెర్జర్‌ పెయింట్స్‌ 7.3-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2.7-1.7 శాతం మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1244 లాభపడగా.. 1143 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3475 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 3918 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3515 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2835 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ.  6,596 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ  ఫండ్స్‌ రూ. 4,975 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.    



You may be interested

కనిష్టాన్ని ఊహించే ప్రయత్నం చేయవద్దు: రామ్‌దేవ్‌ అగర్వాల్‌

Saturday 14th March 2020

మార్కెట్‌ కనిష్టాన్ని ఊహించే ప్రయత్నం చేయవద్దన్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ ఎండీ రామ్‌దేవ్‌ అగర్వాల్‌. బదులుగా నాణ్యమైన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలని ఇన్వెస్టర్లకు సూచించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    ‘‘మార్కెట్ల బోటమ్‌ ఎక్కడ అన్నది ఎవరికీ తెలియదు. ఆరు నెలలు లేదా ఏడాది తర్వాత పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ప్రపంచానికి ఇదే అంతం కాదు. ఒక త్రైమాసికం కోసం

వొడాఫోన్‌ గెలాప్‌- ఎయిర్‌లైన్స్‌ బోర్లా

Friday 13th March 2020

కనిష్టం నుంచి 53 శాతం పెరిగిన వొడా ఐడియా రెండో రోజూ 10 శాతం కుప్పకూలిన స్పైస్‌జెట్‌ ఇంట్రాడేలో 14 శాతం పతనమైన ఇంటర్‌గ్లోబ్‌ ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలకు ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ సహాయక ప్యాకేజీ(బెయిలవుట్‌)ను ప్రకటించే వీలున్నట్లు పెరిగిన అంచనాలు వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. దీంతో ఈ కౌంటర్‌ మార్కెట్ల బాటలో వేగంగా టర్న్‌అరౌండ్‌ సాధించింది. అయితే మరోపక్క విమానయానం, టూరిస్ట్‌ వీసాలపై నిషేధం వార్తలతో ఎయిర్‌లైన్స్‌

Most from this category