News


ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరి

Thursday 5th March 2020
Markets_main1583404240.png-32308

సెన్సెక్స్‌ 61 పాయింట్లు ప్లస్‌
18 పాయింట్లు బలపడిన నిఫ్టీ
పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ అప్‌

ప్రపంచ మార్కెట్లు జోరం‍దుకోవడంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 64 పాయింట్లు పెరిగి 38,471 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు బలపడి 11,269 వద్ద స్థిరపడింది. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమక్రటిక్‌ అభ్యర్థి జో బిజెన్‌ కొన్ని రాష్ట్రాలలో ముందంజ వేయడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 4 శాతంపైగా జంప్‌చేశాయి. ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొంది. మరోపక్క యూరోపియన్‌ మార్కెట్లు సైతం​1 శాతంపైగా లాభంతో ప్రారంభమయ్యాయి. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే దేశీయంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు తలెత్తినట్లు వివరించారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,888 వద్ద గరిష్టాన్నీ, 38,387 వద్ద కనిష్టాన్నీ తాకాయి. ఈ బాటలో నిఫ్టీ సైతం 11389-11245 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

రియల్టీ, మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.4-0.6 శాతం మధ్య లాభనపగా.. రియల్టీ, మెటల్‌ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 27 శాతం దూసుకెళ్లగా.. ఐషర్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, బ్రిటానియా, ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, వేదాంతా 3-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో జీ 6 శాతం పతనంకాగా.. హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, ఆర్‌ఐఎల్‌, సిప్లా, టెక్‌ మహీంద్రా, ఐవోసీ, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ 3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.

బంధన్‌ బ్యాంక్‌ గుడ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో బంధన్‌ బ్యాంక్‌, కేడిలా హెల్త్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, పీవీఆర్‌, పిడిలైట్‌, బయోకాన్‌, గోద్రెజ్‌ సీపీ 6-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా మరోవైపు ఆయిల్‌ ఇండియా, మైండ్‌ట్రీ, కంకార్‌, జస్ట్‌డయల్‌, ఐసీఐసీఐ ప్రు, బీఈఎల్‌, అదానీ పవర్‌ 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1192 లాభపడగా.. 1218 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 878 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 764 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2416 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 3135 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1355 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1139 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందేYou may be interested

భారీ నష్టాలతో నేడు ఓపెనింగ్‌!

Friday 6th March 2020

కరోనా కల్లోలం 405 పాయింట్లు కుప్పకూలిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  గురువారం 3.5 శాతం పతనమైన డోజోన్స్‌ ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల జోరు నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 405 పాయింట్లు పడిపోయి 10,840 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,245 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు తగ్గాయ్‌!

Thursday 5th March 2020

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌) ఖాతాదారులకు వడ్డీరేటును తగ్గించినట్లు చేదు వార్త చెప్పింది. ఒకేసారి 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఖాతాదారులకు వచ్చే వడ్డీ తగ్గనుంది. ప్రస్తుతం 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్‌ఓకు చెందిన సెంట్రల్‌​ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. తాజాగా తగ్గించిన వడ్డీ ఈ ఆర్థిక సంవత్సరం అమలులో

Most from this category