News


చివరికి స్వల్ప లాభాలతో సరి

Wednesday 11th March 2020
Markets_main1583922687.png-32414

ఆటుపోట్ల మధ్య మార్కెట్లు
సెన్సెక్స్‌ 62 పాయింట్లు ప్లస్‌
7 పాయింట్లు బలపడిన నిఫ్టీ
పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ వీక్‌

సానుకూల ప్రపంచ మార్కెట్ల సంకేతాల నడుమ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 62 పాయింట్లు పుంజుకుని 35,697 వద్ద నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,458 వద్ద ముగిసింది. అయితే మార్కెట్లు రోజంతా పలుమార్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,021కు ఎగువన గరిష్టానికి చేరగా.. 35,262 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 10,545- 10,334 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సోమవారం భారీ పతనాలను చవిచూసిన అమెరికా స్టాక్‌ ఇండెక్సులు మంగళవారం 5 శాతం జంప్‌చేశాయి. మరోపక్క బీవోఈ తాజాగా వడ్డీ రేటును 0.5 శాతంమేర తగ్గించడంతో నేటి ట్రేడింగ్‌లో యూరోపియన్‌ మార్కెట్లు 1.5 శాతం లాభాలతో ప్రారంభమయ్యాయి. 

మీడియా ప్లస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, మెటల్‌, ఫార్మా, ఆటో రంగాలు 4-1 శాతం మధ్య పతనంకాగా.. మీడియా 2 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 37 శాతం దూసుకెళ్లగా.. జీ, ఇన్ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, హీరో మోటో, ఆర్‌ఐఎల్‌, బ్రిటానియా, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ 7.5-1.6 శాతం మధ్య పెరిగాయి. అయితే గెయిల్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, ఓఎన్‌జీసీ, హిందాల్కో, వేదాంతా, ఎస్‌బీఐ 10-4 శాతం మధ్య పతనమయ్యాయి.

ఐడియా జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పిడిలైట్‌, సన్‌ టీవీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 10-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐబీ హౌసింగ్‌, ఎన్‌సీసీ, అపోలో టైర్‌, ఆయిల్‌ ఇండియా, కంకార్‌, బీవోబీ 12-6 శాతం మధ్య కుప్పకూలాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.9-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో ట్రేడైన షేర్లలో 1048 లాభపడగా.. 1431 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 6,596 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 4,975 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 2017 నవంబర్‌ 3 తదుపరి ఒకే రోజు ఎఫ్‌పీఐలు ఈ స్థాయిలో అమ్మకాలు చేపట్టడం మళ్లీ ఇప్పుడే! కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 3,595 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 2,544 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ(మార్చి) నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 17,316 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం గమనార్హం! 
 You may be interested

భారీ గ్యాప్‌ డౌన్‌తో ఓపెనింగ్‌ నేడు!

Thursday 12th March 2020

మళ్లీ ప్రపంచ మార్కెట్లలో కరోనా సునామీ 470 పాయింట్లు కుప్పకూలిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  బుధవారం యూఎస్‌ మార్కెట్ల పతనం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల జోరు నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 470 పాయింట్లు పడిపోయి 9,986 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 10,455 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను

ఈ పథకాల మీద వడ్డీరేట్లు తగ్గొచ్చు!

Wednesday 11th March 2020

 చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ), సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌), సుకన్య సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై)లతో పాటు మరికొన్ని చిన్నపాటి పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేకపోలేదని ఒక సీనియర్‌ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. రెపోరేటు, స్మాల్‌ సేవింగ్స్‌ రేట్ల మధ్య ఉన్న అంతరాలు తగ్గితే చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లు తగ్గుతాయని తెలిపారు.

Most from this category