News


స్వల్ప లాభాలతో కొత్త ఏడాదికి స్వాగతం

Wednesday 1st January 2020
Markets_main1577874114.png-30592

ఆదుకున్న ఐటీ, ఎఫ్‌ఎంసీజీ
కొత్త ఏడాది(2020)ని దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో స్వాగతించాయి. బుధవారం సెన్సెక్స్‌ 52 పాయింట్లు పెరిగి 41,306 వద్ద ముగిసింది. నిఫ్టీ 14 పాయింట్లు పుంజుకుని 12,183 సమీపంలో నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,443 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,251 వద్ద కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 12,222-12165 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ మార్కెట్లన్నీ సెలవుల్లో కొనసాగుతుండటంతో ట్రేడింగ్‌ యాక్టివిటీ తగ్గిపోయినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో దేశీ మార్కెట్లు హుషారుగా ప్రారంభమైనప్పటికీ రోజంతా స్వల్ప శ్రేణికే కట్టుబడినట్లు తెలియజేశారు.

మీడియా, ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 0.5-0.3 శాతం మధ్య బలపడగా.. మీడియా, ఆటో, రియల్టీ 0.6-0.3 శాతం మధ్య నీరసించాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా 0.2 శాతం చొప్పున పుంజుకోగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ అదేస్థాయిలో వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, వేదాంతా, ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్‌ 3-0.8 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్‌, ఐషర్‌, ఇండస్‌ఇండ్‌, ఓఎన్‌జీసీ, జీ, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, మారుతీ, యాక్సిస్‌, కొటక్‌ బ్యాంక్‌ 2.8-0.7 శాతం మధ్య క్షీణించాయి.

డెరివేటివ్స్‌ ఇలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, అదానీ పవర్‌, పవర్‌గ్రిడ్‌, టాటా పవర్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, మైండ్‌ట్రీ, సీఈఎస్‌సీ 3.3-1.4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క ఎస్కార్ట్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, డిష్‌ టీవీ, ఎన్‌సీసీ, ఐడియా, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, డీఎల్‌ఎఫ్‌ 4-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. మార్కెట్లను మించుతూ చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపించింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0,.2-0.4 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1358 లాభపడగా.. 1066 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు 
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1265 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 585 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 130.5 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 201 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

ఐపీఓకి వస్తున్న పార్క్‌ హోటల్స్‌

Wednesday 1st January 2020

ఏపీజే సురేంద్ర గ్రూప్‌నకు చెందిన పార్క్‌ హోటల్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కోసం ముసాయిదా పత్రాలను సెబి వద్ద దాఖలు చేసింది. ఈ ఆఫర్‌తో రూ. 1000 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఐపీఓలో కొత్తగా రూ. 400 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. మరో రూ.600 కోట్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్‌లో రూ. 125.4 కోట్లు ప్రమోటర్ల వాటాలు విక్రయించడం ద్వారా, రూ. 354.9 కోట్లు ఏపీజే

ఏటీఎఫ్‌ ధరల పెంపు: అయినా లాభాల్లో ఏవియేషన్‌ షేర్లు

Wednesday 1st January 2020

విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వరుసగా రెండో నెలలో పెరిగాయి. ఏటీఎఫ్ ధరను సరాసరిన కిలోలీటరుకు రూ.1,637.25(2.5శాతం) మేర పెంచుతున్నట్లు చమురు కంపెనీలు బుధవారం వెల్లడించాయి. అలాగే నాన్ సబ్సిడీ ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) లేదా కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధర రూ.19లు మేర పెరిగాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో పాటు డాలరు మారకంలో రూపాయి విలువ

Most from this category