News


మార్కెట్లు ప్లస్‌లోనే- నిఫ్టీ కొత్త రికార్డు

Friday 10th January 2020
Markets_main1578652345.png-30837

ఇంట్రాడేలో 12,311కు నిఫ్టీ
సెన్సెక్స్‌ 150 పాయింట్లు అప్‌
రియల్టీ, మెటల్‌, ఆటో జోరు
చిన్న షేర్లు వెలుగులో

అంతర్జాతీయ మార్కెట్లలో బలపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లోనూ జోరు చూపాయి. సెన్సెక్స్‌ 148 పాయింట్లు బలపడి 41,600కు చేరగా.. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 12,257 వద్ద ముగిసింది. గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోవడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో మిడ్‌ సెషన్‌కల్లా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,311 పాయింట్లను తాకింది. తద్వారా 2019 డిసెంబర్‌ 20న సాధించిన 12,293 పాయింట్ల చరిత్రాత్మక ఇంట్రాడే గరిష్టాన్ని అధిగమించింది. తదుపరి ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ చివర్లో తిరిగి బలపడ్డాయి. అలాగే సెన్సెక్స్‌ మునుపటి రికార్డుస్థాయి 41,810 పాయింట్లను దాటలేకపోయింది.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,775 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 41,448 మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ 12,311- 12,213 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం చల్లడబటంతో గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేసిన విషయం విదితమే. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 1.8-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌, మారుతీ, గెయిల్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌ 3.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 5 శాతం పతనంకాగా.. జీ, ఇండస్‌ఇండ్‌, ఐసీఐసీఐ, టైటన్‌, విప్రో, ఎయిర్‌టెల్‌, బ్రిటానియా, యాక్సిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 3.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

సన్‌ టీవీ జూమ్‌
డెరివేటివ్స్‌లో సన్‌ టీవీ 7 శాతం జంప్‌చేయగా.. సెంచురీ టెక్స్‌, టాటా ‍గ్లోబల్‌, ఈక్విటాస్‌, సెయిల్‌, టాటా కెమ్‌, చోళమండలం, గోద్రెజ్‌ సీపీ 4-2.2 శాతం మధ్య పెరిగాయి. అయితే మరోవైపు ఐబీ హౌసింగ్‌,  మహానగర్‌ గ్యాస్‌, ఐడియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పిరమల్‌, నిట్‌ టెక్‌, అశోక్‌ లేలాండ్‌, జీఎంఆర్‌ 2.7-1.2 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. రియల్టీ స్టాక్స్‌లో ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా, ఫీనిక్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 5-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1420 లాభపడగా.. 1135 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 431 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 419 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 516 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 748 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందేYou may be interested

టాటామోటర్స్‌కు చైనా జేఎల్‌ఆర్‌ అమ్మకాల జోష్‌

Friday 10th January 2020

2.50శాతం లాభంతో ముగిసిన షేరు ఇంట్రాడేలో 8నెలల గరిష్టానికి చైనాలో డిసెంబర్‌ అమ్మకాలు పెరిగినట్లు గణాంకాలు వెలువడటంతో టాటా మోటర్స్‌ షేరు శుక్రవారం 2.50శాతంతో ముగిసింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో మునుపటి ముగింపు(రూ.192.05)తో పోలిస్తే అతిస్వల్ప లాభంతో రూ.192.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ఇంట్రాడేలో డిసెంబర్‌ నెలకు సంబంధించిన జేఎల్‌ఆర్‌ విక్రయ గణాంకాలు విడుదలయ్యాయి. చైనాలో ఈ డిసెంబర్‌లో మొత్తం  52,814 వాహనాలు విక్రయం జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. వార్షిక

రుణభారం లేని కంపెనీల షేర్లను ఎన్నుకొండి..!

Friday 10th January 2020

అప్పు నిప్పు లాంటిందని భారతీయ సమాజం భావిస్తుంది. ఈ సెంటిమెంట్‌ ప్రభావం రుణభారంతో సతమతమవుతున్న కంపెనీలపై పడింది. గతేడాదిలో అధిక అప్పులతో కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. వాస్తవానికి రుణరహితంగా ఉన్న మెజారిటీ కంపెనీల షేర్లు 2019లో 122శాతం పెరిగాయి. రుణరహిత కంపెనీల్లో అగ్రశ్రేణిలో ఉన్న టాప్‌-15 కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు 50శాతం లాభాల్ని పంచాయి.  రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఆస్ట్రాజెనికా

Most from this category