News


3 రోజుల నష్టాలకు చెక్‌- లాభాల ముగింపు

Thursday 23rd January 2020
Markets_main1579775433.png-31141

సెన్సెక్స్‌ 271 పాయింట్లు జూమ్‌
నిఫ్టీ 73 పాయింట్లు అప్
రియల్టీ జూమ్‌- మీడియా డౌన్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లలో వరుస నష్టాలకు చెక్‌ పడింది. మూడు రోజుల అమ్మకాలకు బ్రేక్‌వేస్తూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 271 పాయింట్లు ఎగసి 41,386 వద్ద నిలవగా.. నిఫ్టీ 73 పాయింట్లు పుంజుకుని 12,180 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల అంచనాలకుతోడు, ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌జత కలవడంతో మార్కెట్లు జోరందుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. చైనాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు డీలాపడగా.. ముడిచమురు ధరలు నీరసించాయి. దీంతో మూడు రోజుల్లో చమురు ధరలు 5 శాతం క్షీణించాయి. ఫలితంగా వాణిజ్య లోటు తగ్గే వీలున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇది సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,414 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,099 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 12,189-12,094 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ, ఆటో రంగాలు 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. మీడియా 2 శాతం క్షీణించింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, ఐవోసీ, గెయిల్‌, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, టైటన్‌, ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌ 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే జీ 7 శాతం పతనంకాగా.. యూపీఎల్‌, సిప్లా, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐషర్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌ 4-0.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. రియల్టీ కౌంటర్లలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌, సన్‌టెక్‌, శోభా, ఒబెరాయ్‌ 6.4-1.25 శాతం మధ్య ఎగశాయి. 

నిట్‌ టెక్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో నిట్‌ టెక్‌ 9 శాతం దూసుకెళ్లగా.. పీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్‌, ఐడియా, పిరమల్‌, సెంచురీ టెక్స్‌, ఐజీఎల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 6-4 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క కమిన్స్‌, ఎన్‌ఎండీసీ, డిష్‌ టీవీ, పీవీఆర్‌, అరబిందో, సీఈఎస్‌సీ 2.6-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1455 లాభపడగా.. 1069 నష్టాలతో ముగిశాయి.

అమ్మకాల బాట
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 176 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 326 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 50 కోట్లు,  డీఐఐలు​రూ. 308 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు కేవలం రూ. 6 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1420 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమేYou may be interested

ద్రవ్యోల్బణ ఎఫెక్ట్‌: ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లు యథాతథమే..!

Thursday 23rd January 2020

డిసెంబర్‌లో ద్రవ్యోల్బణ స్థాయి గణనీయంగా నమోదు కావడంతో ఫిబ్రవరిలో జరిగే ‍ద్రవ్యపరిపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని రాయిటర్‌ అధ్యయన నివేదికలో పేర్కోంది. ‘‘డిసెంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్టానికి చేరి 7.35శాతంగా నమోదైంది. జనవరిలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్య శ్రేణిని మించి ద్రవ్యోల్బణ గణంకాలు నమోదు కావడంతో వడ్డీరేట్ల తగ్గింపుపై పునరాలోచనలో పడింది.’’ అన్ని రాయిటర్స్‌  తెలిపింది.

హాస్పిటల్స్‌, ఫార్మాపై దృష్టి పెట్టవచ్చు

Thursday 23rd January 2020

దేశీ మార్కెట్లపై దృష్టిపెట్టిన హెల్త్‌కేర్‌ కంపెనీలపట్ల ఆసక్తిగా ఉన్నట్లు దీపన్‌ మెహతా చెబుతున్నారు. ఆరోగ్యపరిరక్షణ రంగంలో హాస్పిటల్స్‌ కౌంటర్లను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలిగ్జిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ అయిన మెహతా మార్కెట్ల నడకసహా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. పెయింట్స్‌ ఖరీదెక్కువ పెయింట్స్‌ రంగ కౌంటర్లు ప్రస్తుతం అత్యంత ఖరీదుగా ఉన్నాయి. ఉదాహరణకు ఏషియన్‌ పెయింట్స్‌ నిర్వహణ లాభం 8

Most from this category