News


రెండో రోజూ మార్కెట్లు అప్‌

Friday 24th January 2020
Markets_main1579862065.png-31175

సెన్సెక్స్‌ 227 పాయింట్లు ప్లస్‌
68 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
బ్రెగ్జిట్‌ డీల్‌తో యూరప్‌ మార్కెట్లకు జోష్‌

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే జోరందుకున్నాయి. ఆపై ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా హుషారుగా కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 227 పాయింట్లు ఎగిసి 41,613 వద్ద నిలవగా.. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 12,248 వద్ద స్థిరపడింది. అయితే ఆసియా మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో తొలుత సెన్సెక్స్‌ 41,276 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. తదుపరి చివర్లో 41,697 వద్ద గరిష్టానికి సైతం చేరింది. ఇందుకు ప్రధానంగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే(బ్రెగ్జిట్‌) ప్రక్రియ చట్ట రూపాన్ని సంతరించుకోవడం సహకరించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 28 దేశాల ఈయూ నుంచి వైదొలగేందుకు బ్రిటన్‌ 2016 జూన్‌లోనే నిర్ణయించుకుంది. అయితే మూడున్నరేళ్లుగా తగిన ఒప్పందం కుదుర్చుకోలేక వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా బ్రిటన్‌ పార్లమెంట్‌(అప్పర్‌ హౌస్‌ ఆఫ్‌లార్డ్స్‌) ఆమోదముద్ర వేయడంతో ఒప్పందం చట్టంగా మారనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇందుకు ఈయూ పార్లమెంట్‌ సైతం ఆమోదముద్ర వేసినట్లు తెలియజేశారు. దీంతో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇది దేశీయంగానూ సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. నిఫ్టీ ఇంట్రాడేలో 12,272-12,150 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఫార్మా దాదాపు యథాతథంగా నిలవగా.. మిగిలిన అన్ని రంగాలూ 1-0.3 శాతం మధ్య బలపడ్డాయి. మెటల్‌, బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ 1-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌, టైటన్‌, కొటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4-2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్‌, సిప్లా, ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా మాత్రమే అదికూడా ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

సెంచురీ టెక్స్‌ జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో సెంచురీ టెక్స్‌ 8 శాతం దూసుకెళ్లగా.. కమిన్స్‌, జిందాల్‌ స్టీల్‌, ఈక్విటాస్‌, ఉజ్జీవన్‌, పీవీఆర్‌, బీహెచ్‌ఈఎల్‌, మదర్‌సన్‌, ఎన్‌బీసీసీ 5-3.3 శాతం మధ్య జం‍ప్‌చేశాయి. అయితే మరోపక్క ఎన్‌ఎండీసీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎన్‌ఐఐటీ టెక్‌, టాటా గ్లోబల్‌, జస్ట్‌డయల్‌, అపోలో హాస్పిటల్స్‌, కెనరా బ్యాంక్‌ 3-1 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1393 లాభపడగా.. 1136 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల యూటర్న్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొనుగోళ్లకు దిగారు. రూ. 1352 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) అమ్మకాలు కొనసాగిస్తూ రూ. 984 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 176 కోట్లు, డీఐఐలు రూ. 326 కోట్లు విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. You may be interested

బడ్జెట్‌ బాగుంటే.. ఈ షేర్లు రయ్‌ రయ్‌!

Friday 24th January 2020

రాబోయే బడ్జెట్లో ఐటీ స్లాబుల తగ్గింపు, ఎల్‌టీసీజీ కోత, డీడీటీ నుంచి ఉపశమనం, ప్రభుత్వ మూలధనవ్యయాల పెరుగుదల, రియల్టీ రంగానికి మరిన్ని ఉద్దీపనల్లాంటి తాయిలాలుంటాయని మార్కెట్‌ వర్గాలు ఆశిస్తున్నాయి. పలు స్టాకులు ఈ ఆశల అంచనాలతో ప్రీ బడ్జెట్‌ ర్యాలీ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ వర్గాలు ఆశించిన వరాలన్నీ బడ్జెట్లో ఉంటే కొన్ని షేర్లు బడ్జెట్‌ అనంతరం రయ్‌మని దూసుకుపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  - ఐటీ స్లాబుల తగ్గింపు,

Q3 జోష్‌- ఈ 3 మిడ్‌ క్యాప్స్‌ జోరు

Friday 24th January 2020

వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 272 పాయింట్లు జంప్‌చేసి 41,658ను తాకగా.. నిఫ్టీ 84 పాయింట్ల ఎగసి 12,264 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మూడు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ హోటల్స్‌, అతుల్‌ లిమిటెడ్‌, వెస్ట్‌లైఫ్‌

Most from this category