News


ఐఎంఎఫ్‌ ఎఫెక్ట్‌...12,200 దిగువన నిఫ్టీ ముగింపు

Tuesday 21st January 2020
Markets_main1579603393.png-31077

సెన్సెక్స్‌ 205 పాయింట్లు డౌన్‌
55 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. వర్ధమాన దేశాలలో ఇండియా ఆర్థిక వృద్ధి మరింత నీరసించనున్నట్లు తాజా అంచనాలలో పేర్కొంది. దీంతో ప్రపంచ వృద్ధి ప్రభావితం కానున్నట్లు అంచనా వేసింది. ఈ ప్రభావంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా రోజంతా దాదాపు నష్టాల మధ్యే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 205 పాయింట్లు క్షీణించి 41,324 వద్ద నిలవగా.. నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 12,170 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,532 వద్ద గరిష్టాన్నీ, 41,294 వద్ద కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 12,230-12,162 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఐఎంఎఫ్‌ అంచనాలతో ఆసియా మార్కెట్లలో పెరిగిన అమ్మకాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

మీడియా మాత్రమే 
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ డీలాపడగా.. మీడియా 2.2 శాతం ఎగసింది. ఆటో, మెటల్‌, రియల్టీ రంగాలు 1.3 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, ఐవోసీ, వేదాంతా, పవర్‌గ్రిడ్‌, ఐషర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.3-1.7 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 9 శాతం జంప్‌చేయగా.. జీ 4.5 శాతం ఎగసింది. ఈ బాటలో బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ 1.4-0.4 శాతం మధ్య బలపడ్డాయి.

డెరివేటివ్స్‌ ఇలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో పీఎఫ్‌సీ, బెర్జర్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఎన్‌ఎండీసీ, భెల్‌, మారికో, క్యాస్ట్రాల్‌, ఆయిల్‌ ఇండియా 5.5-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఐడియా 23 శాతం దూసుకెళ్లింది. ఇతర కౌంటర్లలో డిష్‌టీవీ, సెంచురీ టెక్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, జిందాల్‌ స్టీల్‌, అరబిందో, ఐబీ హౌసింగ్‌ 6-2.2 శాతం మధ్య  జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.2 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1396 నష్టపోగా.. 1107 లాభపడ్డాయి.

డీఐఐల భారీ అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సైలెంట్‌ అయ్యారు. కేవలం రూ. 6 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1420 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఇక శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 264 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. You may be interested

జొమాటో సొంతమైన ఉబెర్‌ ఈట్స్‌

Tuesday 21st January 2020

జొమాటో చేతికి ఉబెర్‌ ఈట్స్‌! గురుగావ్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో.. ఉబెర్‌ ఈట్స్‌ను సొంతం చేసుకుంది. ఉబెర్‌ టెక్నాలజీస్‌కు చెందిన ఇండియన్‌ ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌ను ఉబర్‌... జొమాటోకు  విక్రయించింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటో కంపెనీ10 శాతం వాటాను ఉబర్‌కి ఇచ్చింది. ఈ ఒప్పందం విలువ 350 మిలియన్‌ డాలర్లు(రూ.దాదాపు 2,485 కోట్లు)గా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉబెర్‌ ఈట్స్‌ తన

టెలికాం షేర్లకు సుప్రీం కోర్టు జోష్‌..!

Tuesday 21st January 2020

టెలికాం సంస్థల తుది గడువు చెల్లింపు సవరణ పిటిషన్‌ను వచ్చే వారంలో విచారణ చేయడానికి సుప్రీం కోర్టు అంగీకారం తెలపడంతో మంగళవారం టెలికం షేర్లు జోరు చూపించాయి. గత ఏడాది అక్టోబర్‌ 24న టెలికాం కంపెనీలు తమ లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం యూజర్‌ ఛార్జీలు(ఎస్‌యూసీ) 90 రోజుల్లోపు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లు వేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ జనవరి 23తో ఏజీఆర్‌

Most from this category