News


2019కు నష్టాలతో వీడ్కోలు

Tuesday 31st December 2019
Markets_main1577787769.png-30565

సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనం
నిఫ్టీ 87 పాయింట్లు డౌన్‌
ఎదురీదిన రియల్టీ రంగం

ఈ కేలండర్‌ ఏడాది(2019) చివరి రోజుకి దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన మార్కెట్లు తదుపరి ఏ దశలోనూ కోలుకోలేదు. ఇన్వెస్టర్లు అమ్మకాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో చివరికి ఇంట్రాడే కనిష్టాలకు చేరువలో మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనమై 41,254 వద్ద నిలవగా.. నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 12,169 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,607 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,185 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 12,247-12,152 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కాగా..ఈ ఏడాది మూడో వారంలో ఇటు సెన్సెక్స్‌, అటు నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను సాధించిన సంగతి తెలిసిందే. 

మెటల్స్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలన్నీ బలహీనపడగా.. రియల్టీ(0.7 శాతం), మెటల్‌(0.2 శాతం) మాత్రమే బలపడ్డాయి.ప్రధానంగా మీడియా, ఆటో, ఐటీ, బ్యాంకింగ్‌, ఫార్మా 1.5-0.5 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, ఆర్‌ఐఎల్‌, ఐషర్‌, వేదాంతా, హీరో మోటో, ఇండస్‌ఇండ్‌, విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌ 3.6-1 శాతం మధ్య నీరసించాయి. ఇతర బ్లూచిప్స్‌లో కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, గెయిల్‌, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా, ఓఎన్‌జీసీ 2.75-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.

పిరమల్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో పిరమల్‌ 4 శాతం పతనంకాగా.. టీవీఎస్‌ మోటార్‌, బాష్‌, డిష్‌ టీవీ, పేజ్‌, సన్‌ టీవీ 2.6-1.8 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే మరోపక్క పీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్‌, ఎన్‌ఎండీసీ, జూబిలెంట్‌ ఫుడ్‌, అపోలో హాస్పిటల్స్‌, ఎన్‌సీసీ, బీహెచ్‌ఈఎల్‌ 3-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ యథాతథంగా నిలవగా.. స్మాల్‌ క్యాప్‌ 0.4 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1355 లాభపడగా.. 1205 నష్టాలతో నిలిచాయి.

స్వల్ప అమ్మకాలు 
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 130.5 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 201 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 81 కోట్లు, డీఐఐలు రూ. 126 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

క్షీణించిన ఐటీ షేర్లు

Tuesday 31st December 2019

ఐటీ రంగ షేర్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఎన్‌ఎన్‌ఈలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 0.78శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 15,754.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెక్ మహీంద్రా, టీసీఎస్‌, విప్రో లాంటి షేర్లు 2శాతం పతనం కారణంగా ఇంట్రాడేలో 1శాతం నష్టపోయి 15,634.50 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతమైనంది. ఇంట్రాడేలో ఈ రంగానికి చెందిన టెక్‌ మహీంద్రా 3శాతం, జస్ట్‌ డయల్‌ 2శాతం, విప్రో, టాటా

ఐటీసీ సహా 46 షేర్లు బుల్లిష్‌!

Tuesday 31st December 2019

ఎంఏసీడీ సంకేతాలు మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు

Most from this category