News


నష్టాల ముగింపు...నిఫ్టీ 45 పాయింట్లు డౌన్‌

Thursday 20th February 2020
Markets_main1582194678.png-31966

153 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌
హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు

వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ ముందు రోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్క రోజులోనే కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 153 పాయింట్లు క్షీణించి 41,170 వద్ద నిలవగా.. నిఫ్టీ 45 పాయింట్ల వెనకడుగుతో 12,081 వద్ద స్థిరపడింది. బుధవారం అమెరికా మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో కొంతమేర సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,400 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,134 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక నిఫ్టీ 12,152-12,071 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. విదేశీ మార్కెట్లో బంగారం ధర ఏడేళ్ల గరిష్టానికి చేరగా.. దేశీయంగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. మరోపక్క అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ మూడేళ్ల గరిష్టానికి చేరడంతో యూరో మూడేళ్ల కనిష్టాన్ని తాకింది. జపనీస్‌ యెన్‌ సైతం 9 నెలల కనిష్టానికి వెనకడుగు వేసింది. ముడిచమురు ధరలు వరుసగా ఏడో రోజు పుంజుకోవడం ద్వారా మూడు వారాల గరిష్టాలకు చేరాయి. ఇది దేశీ కరెన్సీ రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది.

ప్రభుత్వ బ్యాంక్స్‌ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ 1 శాతం చొప్పున పుంజుకోగా.. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మీడియా 0.6 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, జీ, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, కోల్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.4-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సిప్లా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఐవోసీ, నెస్లే, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌ 2.4-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఐబీ హౌసింగ్‌ స్పీడ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 10 శాతం దూసుకెళ్లగా.. అపోలో టైర్‌, ఐడియా, ముత్తూట్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, అశోక్‌ లేలాండ్‌ 5-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆయిల్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, డీఎల్‌ఎఫ్‌, ఐజీఎల్‌, ఎన్‌సీసీ, పీవీఆర్‌ 3.4-2.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున పురోగమించాయి. ట్రేడైన షేర్లలో 1239 లాభపడగా.. 1277 నష్టపోయాయి.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 191 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 590 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 74 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 309 కోట్లు విలువైన  స్టాక్స్‌ విక్రయించిన విషయం  విదితమే.



You may be interested

ఇండియాబుల్స్ గ్రూప్ షేర్ల జోరు

Thursday 20th February 2020

ఇండియాబుల్స్ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందాలలో ప్రభుత్వం ఎటువంటి అవకతవకలను కనుగొనలేదనే నివేదికలతో ఈ గ్రూప్ షేర్లు 17శాతం వరకు పెరిగాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) దర్యాప్తులో ఇండియాబుల్స్ ఒప్పందంలో పెద్ద అవకతవకలు జరగలేదని తేలినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ సానుకూలాంశంతో... ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇంట్రాడేలో 17.50శాతం పెరిగింది. మార్కెట్‌ ముగిసే సరికి 11శాతం లాభంతో రూ.338.30  వద్ద స్థిరపడింది.  ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేడ్‌ సర్వీసెస్‌ షేరు ఇంట్రాడేలో 5శాతం

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల నుంచి 4 స్టాక్‌ రికమెండేషన్లు

Thursday 20th February 2020

పరిమితి శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా గురువారం సూచీలు లాభ, నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఓ నాలుగు షేర్లను రికమెండ్‌ చేస్తున్నాయి.  1.బ్రోకరేజ్‌ సంస్థ: బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ షేరు పేరు: అరబిందో ఫార్మా రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.634 విశ్లేషణ: అరబిందో ఫార్మాకు చెందిన యూనిట్‌-VI యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి  వాలంటరీ యాక్షన్ ఇనిషియేటెడ్ హోదాతో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ (EIR) ను అందుకోవడం కలిసొచ్చే అంశమని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది.

Most from this category