News


వొలాటిలిటీ మధ్య నష్టాల ముగింపు

Tuesday 25th February 2020
Markets_main1582626654.png-32084

సెన్సెక్స్‌ 82 పాయింట్లు డౌన్‌
31 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 
ఫార్మా రంగం పతన బాట

రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 82 పాయింట్లు క్షీణించి 40,281 వద్ద నిలవగా.. 31 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 11,798 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ ఆందోళనలు, ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు మధ్య మార్కెట్లు పలుమార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. వెరసి సెన్సెక్స్‌ 40,536 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,221 దిగువన ఇంట్రాడే కనిష్టాన్నీ చవిచూసింది. ఇక నిఫ్టీ 11,883- 11,780 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీ తదితర పలు దేశాలలో సైతం కరోనా బాధితులు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆటో, మీడియా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం అత్యధికంగా 2.2 శాతం క్షీణించగా.. ఆటో, మీడియా 0.7 శాతం వెనకడుగు వేసింది. అయితే రియల్టీ, ఐటీ దాదాపు 1 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, హిందాల్కో, ఐషర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గెయిల్‌, ఆర్‌ఐఎల్‌, బీపీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ 2.7-1.3 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, జీ, ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌ఢీఎఫ్‌సీ 2.2-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. 

ఇండిగో డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఇండిగో, పిరమల్‌, అశోక్‌ లేలాండ్‌, అమరరాజా, బయోకాన్‌, గ్లెన్‌మార్క్‌, ఆయిల్‌ ఇండియా 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు మైండ్‌ట్రీ, ఎన్‌ఐఐటీ టెక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, హావెల్స్‌, జిందాల్‌ స్టీల్‌, మదర్‌సన్‌, టొరంట్‌ ఫార్మా, డీఎల్‌ఎఫ్‌, ఉజ్జీవన్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1478 నష్టపోగా.. 958 లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1161 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 516 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మహాశివరాత్రి పర్వదినం​సందర్భంగా గత శుక్రవారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1495 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 700 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. 
 You may be interested

నిరర్థక ఆస్తులను 2.4-2.5శాతానికి కట్టడి చేస్తాం: ఎస్‌బీఐ కార్డ్స్‌ సీఈవో

Tuesday 25th February 2020

మొత్తం ఆస్తుల్లో నిరర్థక ఆస్తులను 2.4శాతం నుంచి 2.50శాతానికి పరిమితం చేసే దిశగా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హర్దలాల్‌ ప్రసాద్‌ తెలిపారు. కంపెనీ ఐపీఓ మార్చి 2న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 2018 నాటికి 2.9శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏలు గడిచిన ఏడాది డిసెంబర్‌ 31 నాటికి 2.47శాతానికి దిగివచ్చినట్లు ఆయన తెలిపారు. కార్డు చెల్లింపుల ప్రాసెసింగ్ కోసం వ్యాపారులు

భారత్‌-అమెరికాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం!

Tuesday 25th February 2020

అమెరికా, భారత్‌ దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య న్యూఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాలు  ఆర్థిక, వాణిజ్య, రక్షణ సంబంధించి మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అపాచీ ఎం16  హెలికాఫ్టర్ల ఒప్పందం, మానసిక ఆరోగ్యంపై మెడికల్‌ ఉత్పత్తుల సరఫరా ఒప్పందాలపై ఇరు దేశాలు

Most from this category