News


4 రోజుల ర్యాలీకి బ్రేక్‌- నష్టాల ముగింపు

Friday 7th February 2020
Markets_main1581072240.png-31605

సెన్సెక్స్‌ 164 పాయింట్లు డౌన్‌
40 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
రియల్టీ, ఆటో నేలచూపు

నాలుగు రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్‌ పడింది. రోజం‍తా ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 164 పాయింట్లు క్షీణించి 41,142 వద్ద నిలవగా.. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 12,098 వద్ద స్థిరపడింది. నాలుగు రోజుల వరుస ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం అమెరికా మార్కెట్లు మరోసారి కొత్త గరిష్టాలకు చేరుకున్నప్పటికీ.. ఆసియాలో అమ్మకాలు కనిపించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు చెస్పారు. కాగా.. రోజులో అధిక శాతం మార్కెట్లు నేలచూపులతోనే కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,394 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,073 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 12,155-12,074 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

ఫార్మా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా 1.3 శాతం, ఐటీ 0.6 శాతం చొప్పున బలపడగా.. మీడియా 1.7 శాతం పెరిగింది. రియల్టీ, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.7-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌, ఎంఅండ్‌ఎం, గ్రాసిమ్‌, ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ 3.2-1.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే జీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, యాక్సిస్‌, హీరో మోటో, ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, టైటన్‌ 5.5-1 శాతం మధ్య ఎగశాయి.

డీఎల్‌ఎఫ్‌ డీలా
డెరివేటివ్‌ కౌంటర్లలో రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌, ఎన్‌సీసీ, మదర్‌సన్‌, ఎన్‌ఎండీసీ, లుపిన్‌, మణప్పురం, ఐజీఎల్‌ 4.5-2.2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు అరబిందో, బయోకాన్‌, దివీస్‌ లేబ్‌, అశోక్‌ లేలాండ్‌, మెక్‌డోవెల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, గ్లెన్‌మార్క్‌ 6.4-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-0.8 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1287 నష్టపోగా.. 1212 లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం​విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 560 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 304 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 249 కోట్లు, డీఐఐలు రూ. 263 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 366 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 602 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.    



You may be interested

రియాల్టీ షేర్లు.... నేల చూపు

Friday 7th February 2020

శుక్రవారం  స్టాక్‌ మార్కెట్‌లో రియాల్టి షేర్లు భారీగా పతనమయ్యాయి. నిఫ్టి రియాల్టీ ఇండెక్స్‌ 1.75 శాతం తగ్గుదలతో 320.55 వద్ద ముగిసింది. డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ 4.47 శాతం తగ్గి 235.30 వద్ద,ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్  2.40 శాతం తగ్గి 372.10 వద్ద, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 2.29 శాతం తగ్గి 234.25 వద్ద, శోభా లిమెటెడ్‌ 1.33 శాతం తగ్గి 406.60 వద్ద, మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ 0.22 శాతం తగ్గి

ఐపీఓతో పాలసీ హోల్డర్లకు ప్రాబ్లమ్‌ లేదు: ఎల్‌ఐసీ

Friday 7th February 2020

ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఎల్‌ఐసీని పబ్లిక్‌ లిస్టింగ్‌కు తెచ్చే యత్నాలు ఆరంభమయ్యాయి. ఐపీఓకు సంబంధించి పనులు మొదలెడతామని, కానీ ఇందుకు నిర్ధిష్ట సమయం నిర్ధారించలేమని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. ఐపీఓతో పాలసీ హోల్డర్లపై, కంపెనీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కంపెనీ వాల్యూషన్‌పై ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. ఇంకా వాల్యూషన్ల మదింపు చేయలేదని తెలిపారు. రూ.

Most from this category