News


ఆటుపోట్ల మధ్య నష్టాల ముగింపు

Wednesday 4th March 2020
Markets_main1583317654.png-32278

సెన్సెక్స్‌ 214 పాయింట్లు డౌన్‌
52 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
ఫార్మా, ఐటీ రంగాలు లాభాల్లో

కరోనా కల్లోలానికి చెక్‌ పెట్టేందుకు వీలుగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నపళంగా అర శాతం వడ్డీ రేటును తగ్గించినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 214 పాయింట్లు క్షీణించి 38,409 వద్ద నిలవగా.. నిఫ్టీ 52 పాయింట్ల వెనకడుగుతో 11,251 వద్ద స్థిరపడింది. ఫెడ్‌ వడ్డీ తగ్గింపుతో మంగళవారం తొలుత అమెరికా మార్కెట్లు 1 శాతం బలపడినప్పటికీ కరోనా భయాలతో చివరికి 3 శాతం పతనమయ్యాయి. ఈ అందోళనలు ఆసియాలోనూ కొంతమేర ప్రతిఫలించడంతో దేశీ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,792 వద్ద గరిష్టానికి చేరగా.. మధ్యాహ్నానికల్లా అమ్మకాలు ఊపందుకుని 37,846 వరకూ జారింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,357- 11,082 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనయ్యింది. 

బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో మీడియా, బ్యాంక్‌ నిఫ్టీ, రియల్టీ, ఆటో, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 2-0.6 శాతం మధ్య బలహీనపడగా.. ఫార్మా 2 శాతం, ఐటీ 0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీపీసీఎల్‌ 6-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. ఇతర బ్లూచిప్స్‌లో సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌, గెయిల్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం 5-1.5 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు డౌన్‌
డెరివేటివ్స్‌లో శ్రీరామ్‌ ట్రాన్స్‌, సెంచురీ టెక్స్‌, ఎన్‌సీసీ, నౌకరీ, మదర్‌సన్‌, జిందాల్‌ స్టీల్‌, అశోక్‌ లేలాండ్‌ 7.3-4 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోవైపు బాష్‌, పిడిలైట్‌, ఆయిల్‌ ఇండియా 3 శాతం చొప్పున ఎగశాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.6 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1841 నష్టాలతో ముగియగా.. 469 మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2416 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 3135 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1355 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1139 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. 



You may be interested

టాటామోటార్స్‌ షేరు 5% డౌన్‌

Wednesday 4th March 2020

బుధవారం టాటా మోటార్స్‌ షేరు 5 శాతానికి పతనమైంది. 2020 ఫిబ్రవరిలో 34.42 శాతం పడిపోయాయని కంపెనీ మంగళవారం ప్రకటించడంతో నేడు షేరు విలువ పడిపోయింది. కోవిడ్‌-19 ప్రభావంతో చైనానుంచి సరఫరా కావాల్సిన విడిభాగాలు ఆగిపోవడంతో టాటామోటార్స్‌ ఉత్పత్తి తగ్గిందని కంపెనీ తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో 56,826 యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి ఈ ఫిబ్రవరిలో 37,826కు పడిపోయింది. అంతేకాకుండా వాణిజ్య వాహనాల ఉత్పత్తి గతేడాదిలో 45.8 శాతంగా ఉంటే ఈ

టాటామోటార్స్‌ షేరు 5% డౌన్‌

Wednesday 4th March 2020

బుధవారం టాటా మోటార్స్‌ షేరు 5 శాతానికి పతనమైంది. 2020 ఫిబ్రవరిలో 34.42 శాతం పడిపోయాయని కంపెనీ మంగళవారం ప్రకటించడంతో నేడు షేరు విలువ పడిపోయింది. కోవిడ్‌-19 ప్రభావంతో చైనానుంచి సరఫరా కావాల్సిన విడిభాగాలు ఆగిపోవడంతో టాటామోటార్స్‌ ఉత్పత్తి తగ్గిందని కంపెనీ తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో 56,826 యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి ఈ ఫిబ్రవరిలో 37,826కు పడిపోయింది. అంతేకాకుండా వాణిజ్య వాహనాల ఉత్పత్తి గతేడాదిలో 45.8 శాతంగా ఉంటే ఈ

Most from this category