STOCKS

News


సెన్సెక్స్‌ 208 పాయింట్లు డౌన్‌

Wednesday 22nd January 2020
Markets_main1579689857.png-31105

63 పాయిం‍ట్లు క్షీణించిన నిఫ్టీ

బడ్జెట్‌పై అంచనాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చివరివరకూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో నష్టాలతో ముగిశాయియి. సెన్సెక్స్‌ 208 పాయింట్లు కోల్పోయి 41,115 వద్ద నిలవగా.. నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 12,107 వద్ద స్థిరపడింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 42,532 వద్ద సెన్సెక్స్‌, 12,225 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. తదుపరి సమయం గడిచేకొద్దీ అమ్మకాలు పెరగడంతో నీరసిస్తూ వచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 41,059 వద్ద, నిఫ్టీ 12,088 వద్ద కనిష్టాలను చవిచూశాయి. 

మెటల్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌ , బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో 1.5-1 శాతం మధ్య నీరసించాయి. అయితే మీడియా 1.7 శాతం, ఐటీ 1 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, మారుతీ, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ 5.3-1.7 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో జీ 5 శాతం జంప్‌చేయగా.. గ్రాసిమ్‌, నెస్లే, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్‌ 3-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. 

ఐడియా వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, ఆయిల్‌, బీఈఎల్‌, ఎన్‌బీసీసీ, జిందాల్‌ స్టీల్‌ 6-3.5 శాతం మధ్య పతనం‍కాగా.. జస్ట్‌ డయల్‌, డిష్‌ టీవీ, ఐసీఐసీఐ ప్రు, నిట్‌ టెక్‌, ఇండిగో, ఏసీసీ, ఎక్సైడ్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4-0.2 శాతం మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1417 నష్టపోగా.. 1084 మాత్రమే లాభపడ్డాయి.

అమ్మకాల బాట
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా​రూ. 50 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం​రూ. 308 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం కూడా ఎఫ్‌పీఐలు కేవలం రూ. 6 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1420 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! 



You may be interested

5 లక్షల బీఎస్‌-6 వాహనాల్ని విక్రయించాం-మారుతి

Wednesday 22nd January 2020

మారుతీ 5 లక్షల బీఎస్‌-6 వాహనాల విక్రయం  దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా 5 లక్షల బీఎస్‌-6 వాహనాలను విక్రయించినట్లు బుధవారం ప్రకటించింది. పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 ఇంజిన్‌ ఉన్న వాహనాలను మాత్రమే విక్రయించేలా నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే తాము 5 లక్షల బీఎస్‌-6 వాహనాలను విక్రయించామని మారుతీ సుజుకీ

ఎర్నింగ్స్‌ వృద్ధిపై యూబీఎస్‌ బుల్లిష్‌

Wednesday 22nd January 2020

విదేశీ నిధుల సహకారంతో 2021 డిసెంబర్‌ నాటికి నిఫ్టీలో 20 శాతం అప్‌మూవ్‌(బేస్‌ కేస్‌) ఉంటుందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ అంచనా వేసింది. ఐదేళ్ల తర్వాత నిఫ్టీ ఎర్నింగ్స్‌పై బుల్లిష్‌గా మారినట్లు తెలిపింది. ఎగుమతులు, విధాన నిర్ణయాలు, మూలధన వ్యయాలు, క్రెడిట్‌ గ్రోత్‌ అనే నాలుగు పారామీటర్ల ఆధారంగా ఎర్నింగ్స్‌పై బుల్లిష్‌గా మారామని తెలిపింది. ఇండియా ఏడేళ్ల నిరుత్సాహం తర్వాత వృద్ధి పరంగా సంధి కాలానికి చేరిందని తెలిపింది.

Most from this category