News


అటూఇటుగా ముగిసిన మార్కెట్లు

Monday 30th December 2019
Markets_main1577701415.png-30535

నిఫ్టీ లాభాల్లో- సెన్సెక్స్‌ నష్టాల్లో
పీఎస్‌యూ బ్యాంక్స్‌ వెనకడుగు

వరుసగా రెండో రోజు సోమవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌కంటే ముందుగానే వెనకడుగు వేశాయి. ఆపై చివరివరకూ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో 41,558 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకుని 12,256 వద్ద స్థిరపడింది. కాగా.. సెన్సెక్స్‌ తొలుత దాదాపు 150 పాయింట్లు ఎగసింది. 41,715 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. తదుపరి 41,453 వరకూ క్షీణించింది. ఈ బాటలో నిఫ్టీ 12,286- 12​ 214 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. వారాంతాన జోరందుకున్న మార్కెట్లు నేటి తొలి సెషన్‌లోనూ పుంజుకోవడంతో ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు దిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. 

ఆటో, మెటల్‌ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, మెటల్‌ రంగాలు 1.25 శాతం స్థాయిలో బలపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ అదే స్థాయిలో వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 4.3 శాతం జంప్‌చేయగా, ఐషర్‌, యూపీఎల్‌, నెస్లే ఇండియా, వేదాంతా, ఎంఅండ్‌ఎం, హీరో మోటో, జీ, హిందాల్కో, కోల్‌ ఇండియా 2.6-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, టీసీఎస్‌, ఐవోసీ, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.2-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

ఐడియా జోరు
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 6 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఎన్‌సీసీ, జిందాల్‌ స్టీల్‌, టీవీఎస్‌ మోటార్‌, బాటా, అశోక్‌ లేలాండ్‌, సెయిల్‌ 4.4-2.2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క కమిన్స్‌ ఇండియా, బీవోబీ, పీఎన్‌బీ, జీఎంఆర్‌, కెనరా బ్యాంక్‌, పెట్రోనెట్‌, పిరమల్‌, పీఎఫ్‌సీ 1.6-1 శాతం మధ్య నీరసించాయి.

చిన్న షేర్లు గుడ్‌
హెచ్చుతగ్గుల మార్కెట్లో మధ్య, చిన్నతరహా కౌంటర్లు వెలుగులో నిలిచాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.3 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.75 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1450 లాభపడగా.. 1120 నష్టాలతో నిలిచాయి.

స్వల్ప పెట్టుబడులు 
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 81 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 126 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 504 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 120 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.
 You may be interested

టెలికంలో చౌక చార్జీల శకం ముగిసినట్లేనా?!

Monday 30th December 2019

కనీస రీచార్జి వాలిడిటీ ప్లాన్‌ను ఒక్కసారిగా 95 శాతం పెంచుతూ ఎయిర్‌టెల్‌ తీసుకున్న నిర్ణయం, టెలికం రంగంలో చౌక చార్జీల యుగానికి శుభం కార్డు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎయిర్‌టెల్‌ వినియోగదారుడు కొత్త నెంబర్‌ తీసుకుంటే చేయించుకోవాల్సిన కనీస రీచార్జి రూ. 23 ఉండేది. ఇప్పడీ చార్జీని ఎయిర్‌టెల్‌ రూ. 45కు పెంచింది. దీంతో టారిఫ్‌లు పెంచుకొని రెవెన్యూను అభివృద్ధి చేసుకోవాలన్నదే టెల్కోల ప్రాధాన్యంగా మారినట్లు తెలుస్తోందని, గతంలోలాగా

జనవరి సీరిస్‌ కోసం టాప్‌ టెన్‌ సిఫార్సులు

Monday 30th December 2019

కొత్త సంవత్సరం తొలి నెల కోసం ప్రముఖ బ్రోకరేజ్‌లు పది షేర్లను రికమండ్‌ చేస్తున్నాయి. ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండేషన్లు 1. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 360. స్టాప్‌లాస్‌ రూ. 324. దీర్ఘకాలిక ఆరోహణ త్రిభుజాకృతి నుంచి బ్రేకవుట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రెండు వారాలుగా గత గ్యాప్‌ ఏరియా రూ. 321-325ను పరీక్షించి బలమైన మద్దతు బేస్‌ ఏర్పరుచుకుంది. త్వరలో గత పతనానికి 123.6 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలకు ర్యాలీ జరిపేందుకు

Most from this category