News


ఒడిదుడుకుల మధ్య చివరికి నష్ఠాలు

Monday 23rd December 2019
Markets_main1577098208.png-30386

పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ వీక్‌
మీడియా, ఆటో రంగాలు ప్లస్‌

గత వారం సరికొత్త రికార్డులతో దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఆద్యంతం​ఒడిదుడుకులను చవిచూశాయి. చివరికి స్వల్ప వెనకడుగుతో ముగిశాయి. సెన్సెక్స్‌ 39 పాయింట్లు క్షీణించి 41,643 వద్ద నిలవగా.. నిఫ్టీ 9 పాయింట్లు నీరసించి 12,2663 వద్ద స్థిరపడింది. గత వారం ర్యాలీ జరిగిందున, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.3 శాతం క్షీణించగా.. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. అయితే మీడియా, ఆటో రంగాలు 0.7 శాతం బలపడ్డాయి. 

యస్‌ బ్యాంక్‌ నేలచూపు
నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ దాదాపు 4 శాతం పతనంకాగా.. నెస్లే, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా, ఐసీఐసీఐ, అల్ట్రాటెక్‌ 2.4-0.8 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దాదాపు 4 శాతం లాభపడగా.. వేదాంతా, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటో, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌ 2.4-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి.

ఐడియా డీలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా, ఎన్‌బీసీసీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, జీఎంఆర్‌, కెనరా బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు టాటా కెమికల్స్‌, బాష్‌, బెర్జర్‌ పెయింట్స్‌, క్యాస్ట్రాల్‌, అంబుజా సిమెంట్‌, ఏసీసీ, టొరంట్‌ ఫార్మా, ముత్తూట్‌ ఫైనాన్స్‌ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్ ఇండెక్సులు నామమాత్ర నష్టాలతో ముగిశాయి. ట్రేడైన షేర్లలో 1398 నష్టపోగా.. 1120 లాభాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 339 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 285 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.



You may be interested

నిఫ్టీలో కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Monday 23rd December 2019

శుభమ్‌ అగర్వాల్‌ నిఫ్టీలో ప్రస్తుతం కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం మంచిదని ప్రముఖ అనలిస్టు శుభమ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ వ్యూహం నాలుగంచెలుగా ఉంటుంది. ఇందులో ప్రస్తుత స్థాయికి దగ్గర్లోని కాల్‌ను ఒకలాట్‌ కొంటారు. అనంతరం దానికి పైన అధిక స్థాయికి చెందిన కాల్‌ రెండు లాట్లు అమ్మాలి. అనంతరం అమ్మిన కాల్‌కు దగ్గర్లోని ఒక కాల్‌ లాట్‌ ఒకటి కొనడం జరుగుతుంది. ఈ వ్యూహంలో లాభాలు స్వల్పమైనా స్థిరంగా ఉంటాయి,

యస్‌బ్యాంక్‌ 3.50శాతం డౌన్‌

Monday 23rd December 2019

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జాబితా నుంచి తొలగించడంతో యస్‌ బ్యాంక్‌ సోమవారం ట్రేడింగ్లో 3.50శాతం నష్టపోయింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.50.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్‌ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్‌ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్‌ఈ చేర్చింది. ఫలితంగా ట్రేడింగ్‌ ఆరంభం నుంచి షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైయ్యాయి.

Most from this category