News


రికార్డుస్థాయి నుంచి పతనం..!

Monday 20th January 2020
Markets_main1579515951.png-31052

సెన్సెక్స్‌ 416 పాయింట్లు డౌన్‌
128 పాయిం‍ట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు ఊపందుకోవడంతో చివరికి పతనంతో నిలిచాయి. సెన్సెక్స్‌ 416 పాయింట్లు కోల్పోయి 41,529 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 128 పాయింట్లు క్షీణించి 12,224 వద్ద స్థిరపడింది. అయితే తొలుత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 42,274 వద్ద సెన్సెక్స్‌, 12,430 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. తదుపరి సమయం గడిచేకొద్దీ అమ్మకాలు పెరగడంతో నీరసిస్తూ వచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 41,503 వద్ద, నిఫ్టీ 12,217 వద్ద కనిష్టాలను చవిచూశాయి. ప్రధానంగా ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించిన ఆర్‌ఐఎల్‌ తదితర దిగ్గజ కంపెనీలతోపాటు బ్యాంకింగ్‌ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

బ్యాంక్‌ నిఫ్టీ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ 1.6 శాతం తిరోగమించింది. ఇతర రంగాలలో మీడియా, ఫార్మా, మెటల్‌, ఆటో, ఐటీ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ 0.2-0.4 శాతం చొప్పున బలపడ్డాయి. బ్యాంక్‌ నిఫ్టీలో కొటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, బీవోబీ, పీఎన్‌బీ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, యస్‌ బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌ 5-1.25 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఐవోసీ, ఆర్‌ఐఎల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 4-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, గెయిల్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, ఎల్‌అండ్‌టీ 3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.

ఫైనాన్స్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో పీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, లుపిన్‌, ఆయిల్‌, ఐబీ హౌసింగ్‌, బీఈఎల్‌ 8-3.3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఐడియా 10 శాతం దూసుకెళ్లగా.. ఎన్‌ఎండీసీ, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రు, సెంచురీ టెక్స్‌, మైండ్‌ట్రీ 7-1.4 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ 0.6-0.4 శాతం మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1577 నష్టపోగా.. 953 మాత్రమే లాభపడ్డాయి.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 264 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 395 కోట్లు, డీఐఐలు రూ. 185 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.   You may be interested

అంచనాల్ని అందుకోని కోటక్‌ బ్యాంక్‌ ఫలితాలు

Monday 20th January 2020

ముంబై: ప్రైవేటు రంగ రుణదాత కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్టాండెలోన్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 23.62 శాతం పెరిగి రూ.1,596 కోట్లుగా నమోదైంది. కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు  సోమవారం ముంబైలో జరిగిన సమావేశంలో కన్సాలిడేటెడ్‌,స్టాండెలోన్‌ ఫలితాలను ఆమోదించారు.  ఆర్థిక సంవత్సరం-20 మూడో త్రైమాసిక స్టాండెలోన్‌ నికర లాభం 2019 క్యూ3తో పోలిస్తే 24 శాతం పెరిగి రూ.1,291 కోట్ల నుంచి రూ. 1,596 కోట్లకు

ఫలితాల తర్వాత టీసీఎస్‌ షేరు చాలా ఖరీదు: బ్రోకరేజ్‌లు

Monday 20th January 2020

దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.  ప్రకటించిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే షేరు విలువ అధికంగా ఉంది. కాబట్టి ఈ షేరు కొనుగోలు పట్ల కొంత అప్రమత్తత వహించాలని దేశీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నాయి.  ఈ క్యూ3లో రూ. 8,118 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన రూ.8,105 కోట్ల

Most from this category