News


సెన్సెక్స్‌ 181, నిఫ్టీ 48 పాయింట్ల డౌన్‌

Tuesday 24th December 2019
Markets_main1577183169.png-30412

ఇంట్రాడే కనిష్టం వద్ద ఇండెక్సుల ముగింపు
ఐటీ, ఆటో, మీడియా వీక్‌- మెటల్‌,  రియల్టీ అప్‌

ట్రెండ్‌ను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 181 పాయింట్లు క్షీణించి 41,461 వద్ద నిలవగా.. నిఫ్టీ 48 పాయింట్లు నీరసించి 12215 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,703 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,423 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదేవిధంగా నిఫ్టీ 12284-12202 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ప్రపంచవ్యాప్తంగా పలు స్టాక్‌ మార్కెట్లకు సెలవులు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడం మార్కెట్లను బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ట్రేడర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడం కూడా ఇండెక్సులపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేశారు. 

యస్‌ బ్యాంక్‌ ప్లస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, ఆటో, మీడియా రంగాలు 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. మెటల్‌, రియల్టీ అదే స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, ఐషర్‌, యూపీఎల్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌ 2.7-0.7 శాతం మధ్య నష్టపోయాయి. అయితే యస్‌ బ్యాంక్‌, సిప్లా, ఇండస్‌ఇండ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, హీరోమోటో, జీ, కోల్‌ ఇండియా, కొటక్‌ బ్యాంక్‌ 3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.

డిష్‌ టీవీ డౌన్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో డిష్‌ టీవీ, భారత్‌ ఫోర్జ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఐడియా, కంకార్‌, హెచ్‌పీసీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ 3.2-1.5 శాతం మధ్య క్షీణించాయి, కాగా.. మరోపక్క ఐబీ హౌసింగ్‌, యూబీఎల్‌, నాల్కో, టాటా కెమ్‌, నిట్‌ టెక్‌, జిందాల్‌ స్టీల్‌ 4.3-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో ట్రేడైన షేర్లలో 1334 నష్టపోగా.. 1150 లాభాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం రూ. 1463 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1947 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 339 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 285 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.



You may be interested

‘2020లో 400 మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ రెట్టింపు’

Wednesday 25th December 2019

స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌గా పేర్కొనే పొరింజు వెలియాత్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ అనే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అధిపతి కూడా అయిన ఆయన.. 2020లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యా్ప్‌ స్టాక్స్‌ ర్యాలీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో 1,000 కంపెనీలు ఉండగా, సుమారు 350-400 వరకు సగటున 100 శాతం కంటే ఎక్కవ రాబడులను వచ్చే ఏడాదిలో ఇస్తాయని ఓ వార్తా సంస్థకు తెలిపారు.    మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 15-20 లార్జ్‌క్యాప్‌

మహారాష్ట్ర రుణమాఫీతో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు దెబ్బ: కోటక్‌

Tuesday 24th December 2019

మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రైతుల రుణమాఫీ పథకంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు దెబ్బపడుతుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు ప్రకటనతో మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  సెప్టెంబర్‌ 30వ తేదీ నాటి వరకు రూ.2 లక్షల కలిగిన రైతు రుణాల్ని మాఫీ చేస్తున్నట్లు శనివారం ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం రుణాలు మాఫీ

Most from this category