News


అటూఇటుగా ముగిసిన మార్కెట్లు

Friday 17th January 2020
Markets_main1579256910.png-30996

స్వల్ప లాభాంతో సెన్సెక్స్‌
నిఫ్టీకి నామమాత్ర నష్టం
3 వారాల గరిష్టానికి ఆర్‌ఐఎల్‌
భారతీ ఎయిర్‌టెల్‌ దూకుడు

ఏజీఆర్‌ బకాయిలపై టెలికం రంగం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అటూఇటుగా ముగిశాయి. ఆద్యంతం స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 13 పాయింట్లు బలపడి 41,945 పద్ద నిలవగా.. నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర నష్టంతో 12,352 వద్ద స్థిరపడింది. కాగా.. టెక్‌ దిగ్గజాల అండతో గురువారం అమెరికా మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను అందుకోగా.. ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 3,300 పాయింట్లను అధిగమించింది. అయితే దేశీ స్టాక్‌ మార్కెట్లు మాత్రం వరుసగా రెండో రోజు ఆటుపోట్ల మధ్య కదిలాయి. బడ్జెట్‌ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 42,064 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,850 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 12,385-12,321 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

బ్యాంక్స్‌, మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకిం‍గ్‌, మెటల్‌ రంగాలు 0.7 శాతం స్థాయిలో బలహీనపడగా.. ఫార్మా 1.7 శాతం పుంజుకుంది. ఆటో, మీడియా 0.4 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌ 5.5 శాతం ఎగసింది. ఇంట్రాడేలో రూ. 500ను అధిగమించడం ద్వారా 27 నెలల గరిష్టాన్ని తాకింది. ఇక నేడు ఫలితాలు ప్రకటించనున్న ఆర్‌ఐఎల్‌ 3 శాతం ఎగసింది. రూ. 1581 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల గరిష్టంకాగా.. ఇతర బ్లూచిప్స్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌ 3-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 11 శాతం పతనంకాగా.. ఇండస్‌ఇండ్‌, గెయిల్‌, వేదాంతా, బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ 2.6-1.2 శాతం మధ్య నష్టపోయాయి.

ఐడియా పతనం
డెరివేటివ్స్‌లో పిరమల్‌, క్యాస్ట్రాల్‌, టొరంట్‌ ఫార్మా, బాష్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సీఈఎస్‌సీ, సీమెన్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, డిష్‌ టీవీ 5.5-3.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా 26 శాతం కుప్పకూలింది. ఈ బాటలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, మదర్‌సన్‌, నాల్కో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, కమిన్స్‌, మైండ్‌ట్రీ 3-2 శాతం మధ్య నీరసించాయి. మార్కెట్లను మించుతూ బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1329 లాభపడగా.. 1211 నష్టపోయాయి.

అమ్మకాలవైపు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 395 కోట్లు,  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 185 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 279 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా..డీఐఐలు రూ. 648 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.  
 You may be interested

అమెజాన్‌ నుంచి ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!

Friday 17th January 2020

  అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ న్యూఢిల్లీ: ప్రపంచ ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ శుక్రవారం ఒక కీలక ప్రకటన చేసింది. 2025 నాటికి భారత్‌తో 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు  వెల్లడించింది. ‘‘మీ వ్యాపారంలో వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నారని’’ అమెజాన్‌ ను ఉద్దేశించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ గురువారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..  అమెజాన్‌ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో జెఫ్‌

ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లో గూగుల్‌

Friday 17th January 2020

ఇంటర్‌నెట్‌ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ గురువారం ఆర్థికంగా అరుదైన ఘనతను సాధించింది. కంపెనీ మార్కెట్‌ మొత్తం విలువ తొలిసారి 1ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ ఘనతను సాధించిన నాలుగో అమెరికా కంపెనీగా చరిత్ర పుటలకెక్కింది. గురువారం రాత్రి అమెరికా మార్కెట్లో టెక్నాలజీ షేర్లలో భాగంగా అల్ఫాబెట్‌ షేరు విలువ 0.76శాతం పెరగడంతో దాని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ 1ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. టెక్‌ దిగ్గజం ఆపిల్‌ కంపెనీ 2018లో

Most from this category