News


41,000 దిగువకు సెన్సెక్స్‌

Tuesday 28th January 2020
Markets_main1580207571.png-31274

సెన్సెక్స్‌ 188 పాయింట్లు మైనస్‌
63 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
మెటల్‌ ఇండెక్స్‌ మెల్టింగ్‌

ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనలు వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో తొలుత లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరి రెండు గంటల్లో పెరిగిన అమ్మకాలు మార్కెట్లకు షాకిచ్చాయి. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 188 పాయింట్లు క్షీణించి 40,967 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,056 వద్ద స్థిరపడింది. అయితే ప్రపం‍చ మార్కెట్లు నీరసించినప్పటికీ తొలుత సెన్సెక్స్‌ 41,333 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో చివర్లో 40,870 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 12,163-12,024 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బడ్జెట్‌పై అంచనాలతో ఇటీవల బలపడుతూ వస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో కరోనా వైరస్‌ ఆందోళనలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఆటో, మీడియా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌ ఇండెక్స్‌ 2.4 శాతం క్షీణించగా.. ఆటో, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.2-0.6 శాతం మధ్య నీరసించాయి. ఐటీ స్వల్పంగా 0.25 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, ఆర్‌ఐఎల్‌, యస్‌ బ్యాంక్‌, మారుతీ, కోల్‌ ఇండియా 4.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐవోసీ, టెక్‌ మహీంద్రా, కొటక్‌ బ్యాంక్‌ 2.5-0.4 శాతం మధ్య బలపడ్డాయి.

యూఎస్‌ఎల్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, టొరంట్‌ ఫార్మా, పేజ్‌, సెయిల్‌, సీమెన్స్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, గ్లెన్‌మార్క్‌ 8-3.5 శాతం మధ్య తిరోగమించాయి. కాగా.. మరోపక్క మెక్‌డోవెల్‌ 14 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో డిష్‌ టీవీ, మహానగర్‌ గ్యాస్‌, క్యాస్ట్రాల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, నిట్‌ టెక్‌, ఉజ్జీవన్‌, ఐజీఎల్‌, మణప్పురం 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1527 నష్టపోగా.. 996 మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 439 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక దేశీ ఫండ్స్‌(డీఐఐలు) నామమాత్రంగా రూ. 10.5 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. అయితే గత వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 659 కోట్లు, డీఐఐలు రూ. 418 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.  

 



You may be interested

ఇప్పుడు కొంటే బడ్జెట్‌ తర్వాత లాభాలే!

Tuesday 28th January 2020

గత గణాంకాల విశ్లేషణతో నిపుణుల సూచన సాధారణంగా ప్రతి బడ్జెట్‌ సమయంలో మార్కెట్‌ వర్గాల్లో ఆశలు, అంచనాలు అధికంగా ఉంటాయి. ఈ దఫా కూడా బడ్జెట్‌పై బోలెడు అంచనాలు, ఆశలు ఉన్నాయి, కానీ గతంతో పోలిస్తే తక్కువనే నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌ ముందు వారం మార్కెట్లు స్తబ్దుగా ఉండడం ఎక్కువసార్లు జరిగినట్లు గత గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ దఫా మార్కెట్లు ప్రీబడ్జెట్‌ వారంలో నెగిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌

డీఓటీ వైఖరిపై సుప్రీంలో పిల్‌: నష్టాలతో ముగిసిన టెలికాం షేర్లు

Tuesday 28th January 2020

దేశీయ టెలికాం రంగ షేర్లు మంగళవారం మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ రంగానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, ఐటీఐ, ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌ షేర్ల పతనంతో బీఎస్‌ఈలో టెలికాం సెక్టార్‌ ఇండెక్స్‌ 5శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. మార్కెట్‌ ముగిసే సరికి ఇండెక్స్‌ క్రితం ముగింపు(1,150.51)తో పోలిస్తే 4శాతం నష్టంతో 1161.62 వద్ద స్థిరపడింది.  సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజీఆర్) చెల్లింపునకు సంబంధించి టెలికం

Most from this category