News


ఇరాన్‌ టెన్షన్‌- మార్కెట్లు బోర్లా

Friday 3rd January 2020
Markets_main1578046925.png-30654

బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో డౌన్‌
ఐటీ, ఫార్మా ఎదురీత

మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసింది. అయితే విదేశీ మార్కెట్లలో ముడిచమురు, బంగారం ధరలు బలపడ్డాయి. దీంతో రూపాయి సైతం బలహీనపడగా.. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో మార్కెట్లు ఆద్యంతం నేలచూపులతోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 162 పాయింట్లు నీరసించి 41,465 వద్ద నిలవగా.. నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 12,227 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,345 దిగువన కనిష్టాన్ని చవిచూడగా.. 41,636 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 12,266-12,191 మధ్య హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంది. గురువారం రాత్రి బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా చేపట్టిన మిలటరీ దాడుల కారణంగా ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధానంగా ఇరానియన్‌ జనరల్‌ కాసిమ్‌ మృతి చెందడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును దెబ్బకొట్టినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలలో మూడో వంతు వాటా కలిగిన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా యూరోపియన్‌ మార్కెట్లు సైతం 1 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2 శాతంపైగా క్షీణించాయి. ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌, రియల్టీ 1-0.5 శాతం మధ్య బలహీనపడగా.. ఐటీ 1.5 శాతం ఎగసింది. ఫార్మా సైతం 0.7 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో జీ 5.6 శాతం పతనంకాగా.. ఇన్‌ఫ్రాటెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌, ఐషర్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో, హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌, ఎస్‌బీఐ 2.6-1.6 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టీసీఎస్‌, సన్‌ఫార్మా, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎయిర్‌టెల్‌ 2-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి.

ఎల్‌ఐసీ హౌసింగ్‌ డీలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, అపోలో టైర్‌, కెనరా బ్యాంక్‌, బీవోబీ, డిష్‌ టీవీ, సెంచురీ టెక్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 3.5-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు జీఎంఆర్‌ 4.4 శాతం జంప్‌చేయగా.. నిట్‌ టెక్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఇండిగో, బయోకాన్‌, టొరంట్‌ ఫార్మా 3-1.6 శాతం మధ్య ఎగశాయి. మార్కెట్ల బాటలో బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1275 నష్టపోగా.. 1249 లాభపడ్డాయి.
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 689 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 64 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ.  59 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 208 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.You may be interested

ద్విచక్ర వాహనాలకు స్థిర అవుట్‌లుక్‌: ఇక్రా

Saturday 4th January 2020

ముంబై: ప్రయాణికుల (పీవీ), వాణిజ్య వాహనాల (సీవీ) పట్ల తన నెగెటివ్‌ అవుట్‌లుక్‌ను రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా కొనసాగించింది. ఆర్థిక వృద్ధి నిదానించడం, రిటైల్‌ డిమాండ్‌ ఆశాజనకంగా లేకపోవడం వల్లే ఈ దృక్పథానికి వచ్చినట్టు తెలిపింది. అలాగే, ద్విచక్ర వాహనాలపై స్టెబుల్‌ అవుట్‌లుక్‌ను ప్రకటించింది. తగినంత నిధుల లభ్యత లేకపోవడం, రుణ షరతులు కఠినంగా మారడం, గ్రామీణ ఆదాయం బలహీనంగా ఉండడం గత కొన్ని త్రైమాసికాల్లో వినియోగ డిమాండ్‌పై గణనీయంగా

కరిగిన రూపాయి - ఐటీ షేర్లకు లాభాలు

Friday 3rd January 2020

మార్కెట్‌ నష్టాల్లో ముగిసినప్పటికీ.. శుక్రవారం ఐటీ షేర్లు మాత్రం లాభాల బాట పట్టాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ నెల రోజుల కనిష్టానికి పతనం కావడం ఐటీ షేర్లకు కలిసొచ్చినట్లు విశ్లేషకులంటున్నారు. మధ్యప్రాచ్య దేశంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 3నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఫలితంగా ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ నెల రోజుల కనిష్టానికి దిగివచ్చింది. రూపాయి బలహీనతతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ

Most from this category